
బాలీవుడ్ లో గతేడాది చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన మూవీ 12th ఫెయిల్(12th Fail) . ప్రముఖ రచయిత వినోద్ చోప్రా(Vinod chopra) తెరకెక్కించిన సినిమాలో విక్రాంత్ మస్సీ(Vikranth massy) ప్రధాన పాత్రలో నటించాడు. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. ఇక తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది 12th ఫెయిల్ మూవీ. ఐఎండీబీ లో అత్యధికంగా 9.2 రేటింగ్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. అంతేకాదు.. బయోగ్రాఫికల్ డ్రామా కాన్సెప్ట్ తో వచ్చిన టాప్ 250 ఇండియన్ ఫిల్మ్స్ లిస్టులో టాప్ లో నిలిచింది.
నిజానికి.. 12th ఫెయిల్ సినిమాకు ముందుగా ఆడియన్స్ నుండి పెద్దగా ఆదరణ లభించలేదు. తరువాత మౌత్ టాక్ తో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది ఈ మూవీ. 12th ఫెయిల్ సినిమా కథ సక్సెస్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా వచ్చింది. ఈ సినిమా చాలా మంది ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. కొన్ని సన్నివేశాలలో ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది కూడా. ఇక రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని అవార్డులను అందుకోనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.