ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు..బీసీలకు 138 స్థానాలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు..బీసీలకు 138 స్థానాలు
  • 50 శాతం స్థానాలు మహిళలకు కేటాయింపు
  • ఆదిలాబాద్, ఆసిఫాబాద్​జిల్లాలో ఆరేసి మండలాలు, మంచిర్యాలలో 5 మండలాల్లో బీసీలకు నిల్
  • న్యాయం చేయాలని భీమారం, జన్నారంలో ఆందోళన

ఆదిలాబాద్/మంచిర్యాల, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలోని నాన్ షెడ్యుల్ ఏరియాలోని పలు మండలాల్లో బీసీలకు ఒక్క గ్రామ పంచాయతీ కూడా సీటు కేటాయించలేదు. మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించగా, బీసీలకు 25 శాతం కేటాయించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా షెడ్యుల్ ఏరియాల్లోని అన్ని గ్రామ పంచాయతీలకు ఎస్టీలకు రిజర్వ్ చేయగా, మిగతా గ్రామ పంచాయతీలకు లాటరీ ద్వారా రిజర్వేషన్లు కేటాయించారు. 2011 జనాభా లెక్కలు, బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీలకు 138 సీట్లు  కేటాయించారు. 

బీసీలకు ఒక్కసీటు దక్కని మండలాలు

  • ఆదిలాబాద్ జిల్లాలోని నాన్ షెడ్యుల్ ఏరియాలోని బజార్ హత్నూర్, మావల, నేరడిగొండ, సాత్నాల, సొనాల, సిరికొండలో ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీలకు సీటు కేటాయించలేదు.
  • ఆసిఫాబాద్ జిల్లాలో జైనూర్, బెజ్జూర్, కెరమెరి, లింగాపూర్, సిర్పూర్ యూ, తిర్యాణి మండలాల్లో బీసీలకు చోటు దక్కలేదు. 
  • మంచిర్యాల జిల్లాలో భీమారం, కాసిపేట, కోటపల్లి, మందమర్రి, నెన్నెల మండలాల్లో బీసీలకు స్థానాలు కేటాయించలేదు. 

సీట్లు కేటాయించాలని కలెక్టర్ కోరిన బీజేపీ లీడర్లు

మంచిర్యాల జిల్లాలోని ఐదు మండలాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ స్థానం కూడా దక్కకపోవడం ఆ వర్గాలను నిరాశకు గురిచేసింది. బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్లుగౌడ్​అన్నారు. జిల్లాలో 306 సర్పంచ్ స్థానాలు ఉంటే బీసీలకు 23 మాత్రమే కేటాయించడం శోచనీయమన్నారు. వెంటనే రిజర్వేషన్ల అంశాన్ని పున:పరిశీలించాలని, బీసీలకు చట్టబద్ధంగా 23 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ ​చేశారు. ఈ మేరకు సోమవారం జరిగిన గ్రీవెన్స్​లో కలెక్టర్​కుమార్​దీపక్​ను కలిసి మెమోరాండం అందజేశారు. 

భీమారం, జన్నారంలో రాస్తారోకో..

పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయాలంటూ మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉంటే బీసీలకు రెండు స్థానాలు మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు. రిజర్వేషన్లను సవరించాలని, లేకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తూ ప్రజావాణిలో ఎంపీడీవోకు మెమోరాండం అందజేశారు. భీమారం ఎంపీడీవో ఆఫీస్​ ఎదుట బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గతంలో ఉన్న మాదిరిగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్​ చేశారు. 

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా.. 

  • పంచాయతీల సంఖ్య :    335
  • ఎస్టీ మహిళ     :      2
  • ఎస్టీ జనరల్     :     6

షెడ్యూల్ ఏరియా ఎస్టీ మహిళ    :      78

  • ఎస్టీ జనరల్    :      85
  • నాన్ షెడ్యూల్ ఏరియా
  • ఎస్టీ మహిళ    :      10
  • ఎస్టీ జనరల్     :      17
  • ఎస్సీ మహిళ    :      13
  • ఎస్సీ జనరల్     :     19
  • బీసీ మహిళ    :     7
  • బీసీ జనరల్     :     13
  • అన్ రిజర్డ్వ్ మహిళ    :  40
  • అన్ రిజర్డ్వ్ జనరల్    : 45
  • వందశాతం గిరిజనుల 
  • గ్రామాల సంఖ్య    : 8

  మంచిర్యాల జిల్లా..

పంచాయతీల సంఖ్య    : 306

  • ఎస్టీ మహిళ         : 02
  • ఎస్టీ జనరల్         : 01

షెడ్యూల్ ఏరియా ఎస్టీ మహిళ        : 16

  • ఎస్టీ జనరల్        : 20
  • నాన్ షెడ్యూల్ ఏరియా 
  • ఎస్టీ మహిళ        : 10
  • ఎస్టీ జనరల్         : 16
  • ఎస్సీ మహిళ    :     36
  • ఎస్సీ జనరల్     :     45
  • బీసీ మహిళ        : 10
  • బీసీ జనరల్         : 13
  • అన్ రిజర్డ్వ్ మహిళ    : 66
  • అన్ రిజర్డ్వ్ జనరల్    :71
  • వందశాతం గిరిజనుల 
  • గ్రామాల సంఖ్య    : 03

ఉమ్మడి జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఇలా..ఆదిలాబాద్ జిల్లా

  • పంచాయతీల సంఖ్య     :473 
  • ఎస్టీ మహిళ     :     07
  • ఎస్టీ జనరల్     :     07
  • షెడ్యూల్ ఏరియా
  • ఎస్టీ మహిళ     :     120 
  • ఎస్టీ జనరల్     :     131

నాన్ షెడ్యూల్ ఏరియా

  • ఎస్టీ మహిళ    :     20
  • ఎస్టీ జనరల్     :     27
  • ఎస్సీ మహిళ    :     11
  • ఎస్సీ జనరల్     :     21
  • బీసీ మహిళ    :     09
  • బీసీ జనరల్     :     14
  • అన్ రిజర్డ్వ్ మహిళ    : 47
  • అన్ రిజర్డ్వ్ జనరల్    : 60
  • వందశాతం గిరిజనుల 
  •   గ్రామాల సంఖ్య     : 14

నిర్మల్ జిల్లాలో ఇలా..

  • పంచాయితీ ల సంఖ్య     : 400
  • ఎస్టీ జనరల్         : 22
  • ఎస్టీ మహిళ         : 14

నాన్ షెడ్యూల్ ఏరియా

  • ఎస్టీ మహిళ        : 19
  • ఎస్టీ జనరల్        : 18
  •  జనరల్        : 97
  • జనరల్ మహిళ    : 89
  • బీసీ జనరల్        :41
  • బీసీ మహిళ        :31
  • ఎస్సీ జనరల్    :     42
  • ఎస్సీ మహిళ    :     27
  • వంద శాతం గిరిజన గ్రామాలు: 36