బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మహిళ దగ్గర ఉన్న బంగారాన్ని చూసి బీఎస్ఎఫ్ జవాన్లు షాకయ్యారు. ఒక మహిళ ఏకంగా 25 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని తీసుకురావడం ఆశ్చర్యానికి గురిచేసింది. 2026 ఆగస్టు 30న పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లా బాన్‌పూర్ సరిహద్దు ప్రాంతంలో మహిళ నుంచి 15.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు జవాన్లు.
బంగ్లా నుంచి గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతోందని వచ్చిన సమాచారంతో.. చాలా రోజులుగా బీఎస్‌ఎఫ్ 32వ బెటాలియన్ జవాన్లు చాలారోజులుగా నిఘా పెట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఆ మహిళను అడ్డుకుని తనిఖీ చేయగా.. ఆమె దగ్గర భారీ మొత్తంలో బంగారం దొరికింది. ఇటీవల బార్డర్లో ఇంత పెద్ద మొత్తంలో బంగారం దొరకటం ఇదే తొలిసారి.
బీఎస్‌ఎఫ్ అధికారులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బంగారం ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరికి చేరాలని ప్రయత్నిస్తున్నారు, ఇంకా తస్కరీ నెట్‌వర్క్ ఉందా అనే అంశాలపై విచారణ జరుగుతోంది. ఆమెను త్వరలో కృష్ణగంజ్ పోలీసులకు అప్పగించనున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో బంగారం తస్కరీ కేసులు పెరుగుతున్న క్రమంలో బీఎస్‌ఎఫ్ నిఘాను మరింత పెంచింది.
