Theater Release Movies: ఈ వారం థియేటర్‌లో విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే

Theater Release Movies: ఈ వారం థియేటర్‌లో  విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ, ఇంగ్లీష్..ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రేక్షకులను అలరిస్తే మరికొన్ని నిరాశపరుస్తాయి. ఇక ఈ వారం (సెప్టెంబరు రెండో వారం) కూడా థియేటర్ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటనేవి చూద్దాం.

ఆర్మ్ (ARM)

మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ (Tovino Thomas) రియలిస్టిక్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తో ప్రేక్షకులకు సుపరిచితం. మలయాళ డబ్బింగ్ మూవీ స్ అయినా  ‘మిన్నల్‌ మురళి’, 2018,అన్వేషిప్పిన్ కండేతుమ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

Also Read:-స్ట్రాంగ్ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో

ఇప్పుడాయన నుంచి రానున్న పాన్‌ ఇండియా సినిమా 'ఆర్మ్' (ARM) ‘అజాయంతే రంధం మోషణమ్‌". టోవినో థామస్ 50వ మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.  డెబ్యుటెంట్ డైరెక్టర్‌ జితిన్‌ లాల్‌ తెరకెక్కించిన ఈ సినిమాని టాలీవుడ్ బడా బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ నెల (సెప్టెంబర్ 12న) తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

మత్తు వదలరా2

'మత్తు వదలరా’ చిత్రంతో సక్సెస్‌‌‌‌‌‌‌‌ను అందుకున్న కీరవాణి కొడుకు శ్రీసింహ కోడూరి..ఇప్పుడు దీని సీక్వెల్‌‌‌‌‌‌‌‌ (మత్తు వదలరా 2) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. టీజర్, ట్రైలర్ తో చూపించిన కామెడీ ఎంటర్ టైన్ మెంట్ తో ఆడియాన్స్ లో అంచనాలు పెంచేసారు మేకర్స్.

మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  సునీల్, సత్య, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబరు 13న విడుదల కానుంది.

భలే ఉన్నాడే:

రాజ్‌‌ తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భలే ఉన్నాడే’. డైరెక్టర్ మారుతి సమర్పణలో ఎన్వీ కిరణ్ కుమార్  నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 13న వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమా రిలీజ్ కానుంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వలన సెప్టెంబర్ 7న విడుదల అవ్వాల్సిన ఈ చిత్రాన్ని ఒక వారం వాయిదా వేస్తూ సెప్టెంబర్ 13న తీసుకొస్తున్నారు. 

ఉత్సవం 

రెజీనా, దిలీప్ ప్రకాష్ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అర్జున్ సాయి దర్శకత్వంలో సురేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మించిన చిత్రం ‘ఉత్సవం’. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సెప్టెంబర్ 13న సినిమా విడుదల కానుంది. 

కళింగ 

కిరోసిన్ హిట్‌తో పేరు తెచ్చుకున్న ధృవ వాయు మరోసారి  విభిన్నమైన కథతో...వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న కళింగ మూవీ సెప్టెంబర్ 13న రిలీజ్ కానుంది.