
ప్రేక్షకులు..' వీరివల్లే సినిమాలు, వీరివల్లే నటీనటులకు గుర్తింపు. ఈ ప్రేక్షకులను అలరించడం కోసం సినిమా మేకర్స్ ఎంతకష్టమైన పడతారు. ప్రేక్షకులకు నిత్యం ఎంటర్ టైన్ చేయడానికి కొత్త సినిమాలతో వస్తూనే ఉంటారు.
అలాగే, ప్రేక్షకులు సైతం తమ పనిఒత్తిళ్లను అధిగమించడానికి.. ప్రతివారం కొత్త సినిమాల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తారు. ప్రస్తుతం కుబేర, కన్నప్ప, మార్గన్ వంటి డిఫెరెంట్ జోనర్ సినిమాలతో ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు.
ఈ తరుణంలో నేటి నుంచి కొత్త వారం స్టార్ట్ అవ్వడంతో.. వచ్చే సినిమాల కోసం ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. మరి ఈ వారం (July4) థియేటర్లోకి వచ్చే సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
తమ్ముడు మూవీ:
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. అజనీస్ లోకనాథ్ సంగీతం అందించాడు. సిస్టర్ సెంటి మెంట్ తో మూవీ తెరకెక్కింది. అలాగే, క్రీడా నేపథ్య అంశాలు ఇందులో మిళితం చేయగా, నితిన్ ఆర్చరీ ఆటగాడిగా సందడి చేయనున్నారు. ఈ శుక్రవారం (జులై 4న) సినిమా విడుదల కానుంది.
3BHK మూవీ:
సిద్ధార్థ్ హీరోగా శ్రీగణేష్ దర్శకత్వంలో అరుణ విశ్వ నిర్మించిన మూవీ 3BHK. శరత్ కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇల్లు సొంతం చేసుకోవాలనే జీవితకాల కల కలిగిన మధ్యతరగతి కుటుంబ భావోద్వేగ ప్రయాణంలో సినిమా రానుంది. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో జులై 4న విడుదల కానుంది.
‘జురాసిక్ వరల్డ్ రీ బర్త్’:
2022లో వచ్చిన జురాసిక్ డొమినియన్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ జురాసిక్ వరల్డ్ రీ బర్త్. ఈ మూవీకి గరేత్ ఎడ్వర్డ్స్ దర్శకుడు. స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జులై 4న ఈ మూవీ ఇంగ్లీష్‌తో పాటు, భారతీయ భాషల్లోనూ రిలీజ్ కానుంది.