దుబాయ్: ప్రపంచ వ్యాప్తంగా వన్డే వరల్డ్ కప్పై క్రేజ్ అమాంతం పెరిగింది. 2027 వరల్డ్ కప్ టికెట్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైన కేవలం 12 రోజుల్లోనే ఏకంగా 142 దేశాల నుంచి 1.5 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఐసీసీ మంగళవారం వెల్లడించింది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు జరగనుంది.
ఇప్పటివరకు 44.23 లక్షల మంది అభిమానులు కోటిన్నరకు పైగా టికెట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జొహనెస్బర్గ్లోని వాండరర్స్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్కు సరిగ్గా ఏడాది ముందు అంటే 2026 నవంబర్ 21 వరకు టికెట్ బ్యాలెట్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉండనున్నాయి. 14వ ఎడిషన్ వరల్డ్ కప్ను సరికొత్త ఫార్మాట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ ఆఫ్రికా ఖండానికి రావడం, ఐసీసీ చేపట్టిన గ్లోబల్ ప్రచారం వల్ల టికెట్లకు ఈ స్థాయిలో స్పందన రావడానికి కారణమని ఐసీసీ సీఈవో సంజోగ్ గుప్తా అన్నాడు.
