పెళ్లిళ్లతో 17 ఏళ్లు వేస్ట్ చేసుకున్నా.. 44 ఏళ్ల వయస్సులో మలయాళి నటి షాకింగ్ కామెంట్స్.!

పెళ్లిళ్లతో 17 ఏళ్లు వేస్ట్ చేసుకున్నా.. 44 ఏళ్ల వయస్సులో మలయాళి నటి షాకింగ్ కామెంట్స్.!

1990ల నాటి గ్లామర్ గర్ల్,  మలయాళ సూపర్ హిట్ మూవీ 'తన్మాత' తో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మీరా వాసుదేవన్. టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ ‘అశోక్’ సినిమాలోనూ మెరిసిన ఈ బ్యూటీ, అప్పట్లో తన నటనతో, అందంతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలుతుందని అందరూ అనుకున్నారు. కానీ, సీన్ కట్ చేస్తే... ఆమె పర్సనల్ లైఫ్ ఒక పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన మూడు పెళ్లిళ్లపై చేసిన బోల్డ్ అండ్ క్రేజీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

17 ఏళ్ల వృథా!

ప్రస్తుతం 44 ఏళ్ల వయసున్న మీరా, తన గతాన్ని తలుచుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.  నేను నా కొడుకుతో ఎప్పుడూ ఒకే మాట చెబుతుంటాను.  నా జీవితంలో మూడు పనికిరాని పెళ్లిళ్ల వల్ల వల్ల నా జీవితంలో ఏకంగా 17 ఏళ్ల గోల్డెన్ పీరియడ్‌ను వేస్ట్ చేసుకున్నాను. ఆ టైమ్‌లో గనక నేను సరిగ్గా వర్క్ చేసి ఉంటే, ఇండస్ట్రీలో ఎంతో సాధించేదాన్ని.  సినిమా, ఫిట్‌నెస్, మంచి ఫ్రెండ్స్ సర్కిల్‌ను బిల్డ్ చేసుకోవడంపై ఫోకస్ పెట్టాల్సింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.నన్ను అస్సలు గౌరవించని, అస్సలు సీరియస్‌గా తీసుకోని మనుషుల కోసం నా కెరీర్‌ను, నా పేరెంట్స్‌తో  గడపాల్సిన సమయాన్ని కోల్పోయానని ఆమె ఎమోషనల్ అయ్యింది.

మూడు పెళ్లిళ్లు.. 

మొదటి వికెట్ (2005-2010): సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కొడుకు విశాల్ అగర్వాల్‌ను పెళ్లాడింది. ఐదేళ్లకే కథ ముగిసింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కుమారుడు విశాల్ అగర్వాల్‌ను 2005లో మొదట వివాహం చేసుకుంది. కానీ 2010లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆతర్వాత రెండో పెళ్లి  ప్రముఖ మలయాళ విలన్, నటుడు జాన్ కొక్కెన్ (కె.జి.యఫ్, తునివు ఫేమ్)ను 2012లో పెళ్లాడింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. అయితే మనస్పర్థల వల్ల 2016లో వీరు కూడా విడిపోయారు.  ఇక అంతా సెట్ అయిందనుకున్న టైమ్‌లో 2024 మే నెలలో సినిమాటోగ్రాఫర్ విపిన్ పుతియాంకమ్‌ను సీక్రెట్‌గా మూడో పెళ్లి చేసుకుని షాకిచ్చింది. కానీ, ఈ బంధం కూడా కేవలం ఏడాది తిరగకుండానే (ఆగస్టు 2025లో) బ్రేకప్ అయిపోయింది.

క్రేజీ కంబ్యాక్.. ఇప్పుడు హ్యాపీ!

గతంలో తన్మాత్ర, ఒరువన్, ఏకాంతం, కుట్టిమామ వంటి చిత్రాలతో మెప్పించిన మీరా, ప్రస్తుతం తన లైఫ్‌లో ఒక బ్యూటిఫుల్ ఫేజ్‌లో ఉన్నట్లు ప్రకటించింది. నేను తప్పులు చేశాను, వాటిని దాచాల్సిన అవసరం లేదు. గతాన్ని వదిలేసి ఇప్పుడు నా కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాను. సీరియల్స్, సినిమాలతో బిజీగా ఉంటూ చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ బోల్డ్ అండ్ క్రేజీ స్టేట్‌మెంట్ ఇచ్చింది. వరుస షాకులతో కెరీర్ పరంగా వెనుకబడినప్పటికీ, మీరా ప్రస్తుతం అస్సలు తగ్గడం లేదు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @iamdhanyavarma