యూకో బ్యాంక్ దేశవ్యాప్తంగా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: అప్రెంటిస్.
మొత్తం ఖాళీలు: 530.
తెలంగాణ రాష్ట్ర పరిధిలో 8 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 2026, అక్టోబర్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 14.
లాస్ట్ డేట్: అక్టోబర్ 29.
ఆన్లైన్ ఎగ్జామినేషన్: నవంబర్ 7, ఉదయం 11 గంటలకు.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ uco.bank.inను సందర్శించండి.
ఆన్లైన్ ఎగ్జామినేషన్: ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ / ఫైనాన్షియల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, జనరల్ ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు అడుగుతారు.
