22 ఏళ్ల కుర్రాడి ప్రేమలో 60 ఏళ్ల బామ్మ

22 ఏళ్ల కుర్రాడి ప్రేమలో 60 ఏళ్ల బామ్మ

ప్రేమ.. దీన్ని అర్థం చేసుకోవడం ఎవరితరం కాదు. ఇది రెండు మనసుల మూగ భాష. ఎవరికి ఏ వయసులో పుడుతుందో తెలియదు. ప్రేమకు, వయసుకు సంబంధంలేదని మరోసారి రుజువుచేసిందీ జంట. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన 60 సంవత్సరాల మహిళ, 22 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది.

ఆగ్రాలోని ప్రకాష్ నగర్‌కి చెందిన మహిళ ఏడుగురు పిల్లలకు తల్లి మరియు ఏడుగురు పిల్లలకు బామ్మ. ఈవిడ వయసు 60 ఏళ్లు. ఈ వయసులో 22 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. విషయం తెలిసిన మహిళ భర్త, ఆమె కొడుకు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి యువకుడిపై కేసు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు పెట్టిన సమయంలో యువకుడి కుటుంబం కూడా పోలీస్‌స్టేషన్‌కి వచ్చింది. దాంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇరు కుటుంబాల వారు ప్రేమికులిద్దరికి ఎంత నచ్చజెప్పినా వినలేదు. పైగా.. వారిద్దరూ తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు పోలీసుల ముందు వారివారి కుటుంబాలకు తెలియజేశారు. దాంతో ప్రేమికుల కుటుంబాలు వారి బంధాన్ని ఒప్పుకోమని హెచ్చరించారు. పోలీసులు కూడా మనసు మార్చుకోవాలిని ప్రేమికులిద్దరికీ నచ్చజెప్పారు. అయినాసరే.. వారు మాత్రం విడిపోవడానికి అంగీకరించలేదు. దాంతో పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు.

For More News..

రెండు బిల్డింగ్‌ల మధ్య 17 ఏళ్ల అమ్మాయి అనుమానాస్పద మృతి

ఫ్లెక్సీ కనిపిస్తే.. ఫొటో తీయండి.. ట్వీట్ కొట్టండి..

అమ్మాయిలతో కలిసి ‘రొమాంటిక్’ స్కామ్