
‘మను’ చిత్రం తర్వాత ఫణీంద్ర నర్సెట్టి రూపొందించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘8 వసంతాలు’. అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్‌లో నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. జూన్ 20న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఫణీంద్ర మాట్లాడుతూ ‘-ఒక బలమైన స్త్రీ పాత్ర చుట్టూ తిరిగే కథ ఇది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన డిగ్నిటీ కోల్పోకుండా ఉండే అమ్మాయి ప్రయాణం ఇది. ఆ పాత్ర ఎన్ని కష్టాలు వచ్చినా మృదుత్వాన్ని కోల్పోదు. నేను రాసుకున్న పాత్రకు అనంతిక పర్ఫెక్ట్ యాప్ట్. కేవలం నటిగానే కాదు, దాదాపు 13 కళలలో ఆమెకు ప్రవేశం ఉంది.
మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చు. శుద్ధి అయోధ్య పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది.- తనతోపాటు హనురెడ్డి మేల్ లీడ్‌గా నటించాడు. ఇందులో వీరిద్దరూ రచయితలు కావడంతో వారి మధ్య సంభాషణలు కవితాత్మకంగా ఉంటాయి. రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ ఇతర పాత్రలు పోషించారు. కాశ్మీర్, కన్యాకుమారి, ఊటీ, ఆగ్రాలాంటి అద్భుతమైన లొకేషన్స్‌లో షూట్ చేశాం. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం ప్లెజెంట్‌గా ఉంటుంది. ప్రేక్షకులకు మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది’ అని చెప్పాడు.