మెగాస్టార్ ఇంట్లో సినీతారల సందడి

మెగాస్టార్ ఇంట్లో సినీతారల సందడి

ఎన‌భైల‌ నాటి తార‌లంతా `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ప్ర‌తియేటా వార్షికోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో రకరకాల ప్రదేశాల్లో ఈ మీటింగ్  జరుపుకున్నారు. ఈసారి ప‌దో వార్షికోత్స‌వ పార్టీ కావడంతో ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ఈ కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేయ‌డ‌మే గాక‌.. ఆయ‌నే హోస్టింగ్ చేస్తున్నారు.  హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో ఈ వేడుకను నిర్వ‌హించారు. ఈ రీయూనియ‌న్ మీట్ లో 1980-1990లో అగ్ర తార‌లు పాల్గొన్నారు. బాలీవుడ్,  టాలీవుడ్, కోలీవుడ్ స‌హా మ‌ల‌యాళం.. క‌న్న‌డం నుంచి మొత్తం 40 మంది తార‌లు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. గ‌త తొమ్మిదేళ్లుగా ఈ వేడుక‌లు విజ‌య‌వంతంగా జ‌రుగుతున్నాయి. ప‌దో సారి కావడంతో  ఘ‌నంగా మెగాస్టార్  ఈ వేడుక‌ల్ని స్వ‌యంగా నిర్వ‌హించారు.

80s actors reunion meet at megastar chiranjeevi house