90s వెబ్ సిరీస్ ట్రైలర్‌‌‌‌ విడుదల

90s వెబ్ సిరీస్ ట్రైలర్‌‌‌‌ విడుదల

నటుడు శివాజీ, వాసుకి  ప్రధాన పాత్రలలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘90s’.  ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ట్యాగ్‌‌లైన్.  నవీన్ మేడారం సమర్పణలో  రాజశేఖర్ మేడారం నిర్మిస్తున్నారు. శనివారం ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. 

శివాజీ మిడిల్ క్లాస్ ఫాదర్, స్కూల్ టీచర్‌‌‌‌గా కనిపిస్తుంటే,  అతని భార్య పాత్రలో వాసుకి నటించారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఈ కుటుంబం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, నైంటీస్‌‌లోని అందమైన జ్ఞాపకాలతో పాటు మిడిల్ క్లాస్ కష్టాలను, ఆనందాలను ట్రైలర్‌‌‌‌లో చూపించడం ఆకట్టుకుంది. సురేష్​ బొబ్బిలి బ్యాక్‌‌గ్రౌండ్ స్కోరు ప్లెజెంట్‌‌గా ఉంది. ఓటీటీ ప్లాట్‌‌ఫామ్‌‌ ఈటీవీ విన్‌‌లో జనవరి 5 నుంచి  స్ట్రీమింగ్ కానుంది. 

ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌‌మీట్‌‌లో శివాజీ మాట్లాడుతూ ‘యంగ్ టీమ్‌‌తో చేసిన అందమైన కథ ఇది.  విన్న వింటనే చేయాలనిపించింది. అయితే అదే సమయానికి  ‘బిగ్ బాస్’ అవకాశం వచ్చింది. దాంతో నా కోసం కొంత ముందుగానే షూటింగ్‌‌ను స్టార్ట్ చేశారు. నిర్మాత నవీన్ చాలా విజన్ ఉన్న టెక్నీషియన్. వాసుకి చాలా ప్రతిభ ఉన్న నటి. ఇందులో నటించిన మౌళి, రోహన్, వసంతిక భవిష్యత్‌‌లో చాలా మంచి నటులు అవుతారు. 

ఈ సిరీస్ తప్పకుండా అందరినీ అలరిస్తుంది’ అన్నారు. వాసుకి మాట్లాడుతూ ‘నేను చాలా కనెక్ట్ అయి చేసిన వెబ్ సిరీస్ ఇది. మధ్యతరగతి కుటుంబాలు అంటే నాకు చాలా గౌరవం. చాలా బలంగా ధైర్యంగా ఆనందంగా ఉంటారు’ అని చెప్పింది. ఇందులో అన్ని పాత్రలతో  ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అన్నాడు దర్శకుడు ఆదిత్య హాసన్. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.