8 ఏళ్ల చిన్నారిపై 70 ఏళ్ల తాత లైంగిక దాడి..

8 ఏళ్ల చిన్నారిపై 70 ఏళ్ల తాత లైంగిక దాడి..

పెద్దపల్లి జిల్లాలో మరో ఘోర సంఘటన జరిగింది. సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటలో 8 ఏళ్ల చిన్నారిపై లైంగికదాడికి ప్రయత్నించాడు 70 ఏళ్ల వృద్ధుడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. తాత వరుస అయిన వ్యక్తి బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సుల్తానాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. 

ఈ నెల 13వ తేదీన‌ రాత్రి సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్ మిల్లులో ఆరేళ్ల చిన్నారిపై లైంగిక‌దాడి, హ‌త్య జ‌రిగిన విష‌యం ప్ర‌జ‌లు ఇంకా మ‌రిచిపోలేదు. అంత‌లోనే సుల్తానాబాద్ మండ‌లంలోనే మరో ఘ‌ట‌న జరగడం చర్చనీయాంశంగా మారింది. చిన్నారుల‌పై పైశాచిక‌త్వం ప్రద‌ర్శించే వారిని వ‌ద‌లొద్దని, క‌ఠినంగా శిక్షించాల‌ని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.