సాయిధరమ్ తేజ్ మూవీ వీడియో గ్లింప్స్‌‌‌‌ రిలీజ్

సాయిధరమ్ తేజ్ మూవీ వీడియో గ్లింప్స్‌‌‌‌ రిలీజ్

సాయిధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్‌‌‌‌‌‌‌‌’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది.  శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆదివారం తేజ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌‌‌‌ను రివీల్ చేయడంతో పాటు వీడియో గ్లింప్స్‌‌‌‌ను విడుదల చేశారు. సూపర్ మ్యాన్ కథలు వద్దు లోకల్ మ్యాన్ కథ చెప్పమని ఓ చిన్నారి అడగడంతో తన తండ్రి చెప్పే కథ నుంచి హీరో క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను పరిచయం చేశారు.

‘చిన్నప్పుడే స్కూల్‌‌‌‌ ఎగ్గొట్టేసి, అమ్మానాన్నల మాటను పెడచెవిన పెట్టి, అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతూ, అన్ని చెడు అలవాట్లను ఒంటికంటించుకుని అల్లర చిల్లరగా పెరిగిన వాడే గాంజా శంకర్‌‌‌‌’ అంటూ తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను రివీల్ చేశారు. ‘డోంట్ డిఫైన్ మాస్.. జస్ట్ ఫీల్ ద మాస్‌‌‌‌’ అంటూ తేజ్ పాత్ర ఎంత మాస్‌‌‌‌గా ఉండబోతోందో ఇందులో చూపించారు. ఈ చిత్రానికి రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్ కాగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.