మారేడ్ పల్లిలో అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన స్విఫ్ట్ కారు

మారేడ్ పల్లిలో అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన స్విఫ్ట్ కారు

హైదరాబాద్:మారేడు పల్లిలో నార్త్ జోన్ డీసీపీ కార్యాలయం సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. రన్నింగ్ లో ఉన్న స్విఫ్ట్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. 

బేగంపేట్ నుంచి మారేడుపల్లికి వెళ్తున్న స్విప్ట్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ అప్రమత్తమై కారును పక్కకు నిలిపారు. కారుమొత్తం మంటలు వ్యాపించడంతో స్విఫ్ట్ కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.