అఫ్జల్ గంజ్లో భారీ అగ్ని ప్రమాదం

 అఫ్జల్ గంజ్లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాన్స్ పోర్ట్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మూసీ నాలా పక్కన పుతిలీ బౌలి ప్రధాన రహదారిపై ఉన్నగుడిసెకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆరు ఫైర్ ఇంజిన్ లతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం వాటిల్లిందని, ఎలాంటి ప్రాణహాని కాలేదని అధికారులు స్పష్టం చేశారు.

భారీగా మంటలు ఎగసిపడడంతో అఫ్జల్ గంజ్ & చాదర్ ఘాట్ పోలీసులు పలు వాహనాలను దారి మళ్లించారు. ఈ ప్రమాదానికి విద్యుత్ షాకే కారణమని అగ్నిమాపక అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గతంలో ఇదే ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగిందని డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్టు వెల్లడించారు.