నటుడు నరేష్ కు అరుదైన గౌరవం

నటుడు నరేష్ కు  అరుదైన గౌరవం

ఫిలిప్పీన్స్‌‌ దేశంలో క్యూజోన్ నగరంలోని పోలీస్, డిఫెన్స్ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఉగ్రవాదంపై సినీ నటుడు నరేష్ చేసిన ఉపన్యాసానికి నైట్ హుడ్, అత్యున్నత బిరుదు ‘సర్’ను ప్రదానం చేశారు. మిలిటరీ ఆర్ట్స్, హ్యూమన్ సర్వీస్‌‌లో గౌరవ డాక్టరేట్, పిహెచ్‌‌డితో ఆయన్ను సత్కరించారు. ఆర్బిట్రేషన్ మరియు శాంతి మధ్యవర్తిత్వానికి సహచరుడిగా నరేష్‌‌ను గుర్తించారు. 

పౌర హక్కుల సంరక్షకుడు బిరుదుతో గౌరవించారు.  ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలతో పాటు ఉగ్రవాదాన్ని నిర్వీర్యం చేయడం, అరికట్టడంలో మీడియాకు గొప్ప బాధ్యత ఉందని నరేష్ తన ప్రసంగంలో చెప్పారు. ఈ కాంపెయిన్‌‌ని  ఒక సెలబ్రిటీగా, దౌత్యవేత్తగా ముందుకు తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు.