ఈ కష్టం పగోడికి కూడా రావద్దు.. భార్య కొడుతుందని విడాకులు అడుగుతుండు

ఈ కష్టం పగోడికి కూడా రావద్దు.. భార్య కొడుతుందని  విడాకులు అడుగుతుండు

తన భార్య కొడుతుంది విడాకులు ఇప్పించండి లేదంటే చనిపోతానంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటన ఏప్రిల్ 18వ తేదీ కొంపల్లిలో చోటుచేసుకుంది. జయభేరి పార్క్  చేరువులోకి దిగి హల్ చల్ చేశాడు.  స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు  అక్కడికి చేరుకుని అతని  నచ్చజెప్పి తాడు సహయంతో అతన్ని బయటకు తీసుకువచ్చారు.  హైదరాబాద్ - కు చెందిన నగేశ్  మాట్లాడుతూ తన  భార్య కొడుతోందంటూ ఒంటిపై ఉన్న గాయాలను చూపించాడు. తన పిల్లల దగ్గరకు వెళ్తే రానివ్వడం లేదన్నాడు. తన పిల్లలకు తాను చనిపోయానని చెప్తుందని వాపోయాడు. తనకు విడాకులు ఇప్పించాలని..  లేదంటే సచ్చిపోతా అంటూ ఆందోళనకి దిగాడు.