Viral Video: ఈగకు ట్రైనింగ్​ అంటే ఇదేనేమో మరి..!

Viral Video: ఈగకు ట్రైనింగ్​ అంటే ఇదేనేమో మరి..!

రాజమౌళి తీసిన ఈగ సినిమాలో ఈగ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.. అదంతా గ్రాఫిక్స్​ మాయాజాలంతో సినిమాను రక్తి కట్టించారు.  కాని నిజంగా ఈగకు ట్రైనింగ్​ ఇస్తే ఎలా ఉంటుంది.. అది సాధ్యమేనా.. అంటే సాధ్యమేనని ఓ వీడియో ద్వారా తెలుస్తోంది.  ప్రస్తుతం ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది.  ఈగకు శిక్షణ ఎలా ఇస్తారో.. బాస్​చెప్పిన విధంగా ఎలా నడుచుకుందో... తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోపై ఓ లుక్కేయండి...

నిజ జీవితంలో ఓ ఘనుడు ఈగకు( fly ) ట్రైనింగ్ ఇచ్చాడు.అన్ని తెలిసిన మనిషికి ట్రైనింగ్ ఇచ్చి పని చేయించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాస్త కష్టమైన సరే కుక్కలు, పిల్లులు, కొన్ని రకాల పక్షులకు ట్రైనింగ్ ఇవ్వచ్చు.కాకపోతే ముట్టుకోవడానికి ప్రయత్నిస్తేనే ఎగిరిపోయే ఈగకు ట్రైనింగ్ ఇచ్చాడు అంటే ఆ మనిషి ఎంత ఘనుడో ఆలోచించండి.

తాజాగా వైరల్ అవుతున్న వీడియోని చూస్తే మాత్రం ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తిని మెచ్చుకోకుండా ఉండలేరు.ఓ టేబుల్‌పై ఉన్న ఈగ తన బాస్ ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో సదరు వ్యక్తి ఈగ ముందు వేలు చూపించి, ముందుకు రావాలని సిగ్నల్ ఇస్తాడు. తన బాస్ చెప్పిన విధంగా ఈగ కూడా వేలు మోపిన చోటుకు వస్తుంది.తర్వాత తన వేలును మరో చోట పెడతాడు. ఈగ కూడా వెంటనే ఆ ప్లేస్‌లో వెల్లి వాలుతుంది. ఈ తర్వాత ఈగకు మరింత గట్టి పరీక్ష పెడతాడు. ఓ వృత్తాకార ప్లాస్టిక్ బిళ్లను ఈగ ముందు నిలబెడతాడు. దీంతో ఈగ ఆ బిళ్లను కొంత దూరం ముందుకు నెట్టుకుంటూ వెళ్తుంది. తర్వాత టార్గెట్ కంప్లీట.. అని అన్నట్లుగా తన బాస్ వద్దకు వచ్చి వాలిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral Video) అవుతోంది. ఈ వీడియో  47 మిలియన్లకు పైగా వ్యూస్‌ను  ( వార్తరాసే సమయానికి) సొంతం చేసుకుంది.

 

ఇక ఈ వీడియోను చూసిన నెటిజెన్లు వారి స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు.కొందరైతే తాము చూస్తున్నది నిజమేనా., లేక కొత్త టెక్నాలజీ ఏఐ ను ఉపయోగించి వీడియోను రూపొందించారా అంటూ కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే అసలు ఇలాంటివి సాధ్యమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.  ఇది ఇస్మార్ట్ ఈగలా ఉంది.. అంటూ కొందరు, ఇది కదా అసలు సిసలైన ట్రైనింగ్ అంటే.. అంటూ మరికొందరు, అరే! ఇది కలా.. లేక నిజమా.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.