ముక్ బాంగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ (Mukbang).. అంటే ప్లేట్లకు ప్లేట్ల ఫుడ్.. కుంభాలు కుంభాలుగా తింటూ వీడియో కంటెంట్ చేసే వాళ్లు. గత కొన్నేండ్లుగా ఈ ఈటింగ్ కాంపిటిషన్ ట్రెండింగ్ లో ఉంది. యూట్యూబ్, సోషల్ మీడియా ఛానెళ్లలో ఈ కంటెంట్ కు ఫుల్ క్రేజీ. కెమెరా ముందు కూర్చుని వెరైటీ వంటకాలను కేజీల చొప్పును కుమ్మేయడమే ముక్ బాంగ్ కల్చర్. వాళ్లు తింటుంటే లొట్టలేసుకుంటూ చూసే వ్యూవర్స్ కోట్లలో ఉన్నారు.
మన ఇండియాకు చెందిన మాధురీ లహరీ అనే యువతి ముక్ బాంగ్ కెరియర్ ను ఎంచుకుంది. మ్యాడీ ఈట్స్ (MaddyEats) అనే ఛానెల్ ద్వారా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ గురించి వివరిస్తూ లగాయించడం ఆమె పని. ప్రతి నెల, ప్రతి వారం.. కెమెరా ముందు కూర్చుని.. బర్గర్స్, బిర్యానీ, ఫ్రైడ్ చికెన్, కొరియన్, జపనీస్.. ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన ఫుడ్ ఐటెమ్స్ ను తింటూ వీడియోలు చేస్తూ ఉంటుంది. ముక్ బాంంగ్ కల్చర్ లో ఇన్ ఫ్లుయెన్సర్లు ఏం చేస్తారో ఆమె కూడా అది చేసేది.
మాధురీ 6 మిలియన్స్ అంటే 60 లక్షల ఫాలోవర్స్ తో చాలా పాపులర్ అయిపోయింది. ఫేస్ బుక్, ఇన్ స్టాలో ఆమెకు ఫుల్ క్రేజీ. లక్షల్లో.. సంపాదిస్తుందనుకోండి. ఇది బానే ఉంది. కానీ కంటెంట్ కోసం కేజీల చొప్పున తిన్న ఆమె పరిస్థితి ఏంటనేది ఆఫ్ కెమెరా మ్యాటర్.
కేజీల కొద్దీ తింటూనే ఉంటారు.. వీళ్లకేం కాదా అని దాదాపు ఎవరూ అనుకోకపోచ్చు. కానీ హై ఫ్యాటీ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్, హై న్యూట్రిషియస్ ఫుడ్ ప్లేట్ల కొద్ది ఆరగించడంతో అధిక బరువు , సైడ్ ఎఫెక్ట్స్ మొదలైన సమస్యలను బ్యాలెన్స్ చేయడానికి వాళ్లు పడే యాతన ఏంటనేది అనుభవిస్తే గాని తెలియదు. ఎందుకంటే ఒక రోజు, ఒక వారమో నెలనో చేసేది కాదు. ఏండ్లకు ఏండ్లు తింటూ వీడియోలు చేస్తూనే ఉండాలి.
►ALSO READ | రోజూ గుప్పెడు గుమ్మడి గింజలు తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే !
ముక్ బాంగ్ కంటెంట్ చేయకముందు జిమ్ కు వెళ్లటం, డైట్ పాటించడంతో బాడీ కంట్రోల్ లో ఉండేది.. కానీ ప్రస్తుతం అలాంటివి ఏవి చేసినా వెయిట్ కంట్రోల్ కష్టంగా మారిందని ఆమె చెప్పింది. అయితే అంత తిన్నప్పటికీ బాడీ మరీ ఎక్కువ పెరగక పోవటానికి కారణం.. డీ విటమన్ లోపం కూడా ఒకటి అని చెబుతోంది. ఆ కారణంగా వెయిట్ మరీ ఎక్కువగా పెరగకుండా ఉండేందుకు హెల్ప్ అయినట్లు చెప్పింది.
అయితే వెయిట్ లాస్ కోసం ముంబైలో డాక్టర్ ను సంప్రదిస్తే.. మౌంజరో (Mounjaro) డ్రగ్ రెఫర్ చేయడంతో షాక్ గురైనట్లు పేర్కొంది. అయితే మౌంజరో వాడటంతో క్రమక్రమంగా 6 కేజీల వెయిట్ తగ్గిందట. అయితే ఆ డ్రగ్ వలన మ్యాజిక్ జరిగిందని చెప్పే ప్రచారం లా కాకుండా.. క్రమక్రమంగా 70 నుంచి 64 కేజీలకు వచ్చినట్లు ఆమె తెలిపింది.
అయితే మౌంజరో వాడుతున్నప్పటికీ.. ఆమె బ్రెడ్ అండ్ బటర్.. అంటే కడుపుకు అన్నం పెట్టే వృత్తి ముక్ బాంగ్ వీడియోలు చేయడమే. అందుకోసం ముక్ బాంగ్ చేయడం మానలేదని చెబుతోంది. ప్రతీ వారం వీడియో కంటెంట్ చేసి అప్ లోడ్ చేయక తప్పని పరిస్థితి. అయితే మౌంజరో వాడక ముందు ఒకే సిట్టింగ్ లో ఫుడ్ అంతా లాగించేది.. కానీ ప్రస్తుతం వీడియో కాస్త బ్రేక్ తీసుకోవాలని భావిస్తోందట.
- సైడ్ ఎఫెక్ట్స్:
ఓవర్ గా తినటం.. లావు పెరగకుండా ఉండేందుకు డ్రగ్ వేసుకోవడంతో.. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఆమెను ఇబ్బంది పెట్టినట్లు చెబుతోంది. ముఖ్యంగా వారానికి ఓ ఇంజెక్షన్ వాడతుండటంతో మలబద్ధకం, మత్తు, అప్పుడప్పుడు వికారం మొదలైన సమస్యలు ఎదుర్కొంటుందట. ఎక్కువ శాతం బుధవారం రాత్రి వేసుకుంటే గురువారం మరీ ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుందట.
- మెంటల్ హెల్త్:
ఏండ్లకు తరబడి బరువు తగ్గేందుకు డ్రగ్ తీసుకోవడం.. ఆమెను పూర్తిగా నిరాశకు గురిచేసిన సందర్భాలున్నట్లు చెబుతోంది. మరో ఆరు నెలల్లో నార్మల్ అవుతానని కాన్ఫిడెంట్ గా చెబుబతోంది. మౌంజరో డ్రగ్ అనేది వెయిట్ లాస్ కు మిరాకిల్ అనే దాన్ని ఆమె పూర్తిగా వ్యతిరేకిస్తోంది. మౌంజరో తీసుకుంటున్నాం.. జంక్ ఫుడ్ తిన్నా కూడా వెయిట్ లాస్ అవుతాం అనే ఫీలింగ్ లో ఉండొద్దు అని చెబుతోంది. అయినప్పటికీ వ్యాయామాలు చేయాలి.. డైట్ పాటించాలని ఆమె సూచన. ఇక ప్రెగ్నెన్సీ విషయంలో కూడా ఆ డ్రగ్ ను దూరం ఉంచాల్సిందిగా డాక్టర్లు చెప్పినట్లు ఆమె తెలిపింది.
వేళకు ఆకలైనపుడు, బుద్ధి పుట్టినపుడు తినటం ఓకే. కానీ బాడీకి అవసరం లేకపోయినా హెవీ ఫుడ్ తీసుకోవడం వలన సమస్యలు ఎలా ఉంటాయో మాధురీ ద్వారా తెలుస్తుంది. దీనికి తోడు ఈ మధ్య వెయిట్ లాస్ కోసం మౌంజారో లాంటి డ్రగ్స్ వాడుతున్నారు. అదొక్కటే పరిష్కారం కాదని ఆమె చెబుతున్నారు. ముఖ్యంగా ముక్ బాంగ్ వృత్తిలో ఉండే వాళ్ల సమస్యలు, సవాళ్లు ఎలా ఉంటాయో ఈమె స్టోరీ చదివితే స్పష్టంగా తెలుస్తుంది.
