టాలీవుడ్ యంగ్ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ లో-ప్రొఫైల్ మెయింటైన్ చేసే ఈ యంగ్ హీరో, తాజాగా తన మనసు దోచుకున్న 'కావ్య' ఫోటోను షేర్ చేస్తూ అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఎట్టకేలకు గత కొన్ని రోజులుగా ఆయన పెళ్లిపై వస్తున్న ఫుకార్లకు చెక్ పెట్టారు. తన కాబోయే భార్యను అభిమానులకు పరిచయం చేస్తూ.. సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
తన 'కావ్య'ను పరిచయం చేస్తూ..
శ్రీనివాస్ తన పోస్ట్‌లో తన ప్రేమను చాలా అందంగా వ్యక్తీకరించారు. "నా కావ్యమ్మకు.. జీవితానికి ఒక అందమైన టైమింగ్ ఉంటుంది. ఆ సమయమే నిన్ను నా ప్రపంచంలోకి తీసుకువచ్చింది. నా జీవితంలోకి వచ్చినందుకు, సరైన సమయంలో నన్ను నమ్మినందుకు, నా రోజులను సానుకూలతతో, చిరునవ్వులతో నింపినందుకు కృతజ్ఞతలు. నీ ముఖంపై ఆ చిరునవ్వు ఎప్పటికీ మాయం కాకుండా చూసుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను. మన ఇద్దరి 'ఫరెవర్' ప్రయాణం కోసం నేను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ప్రేమతో.. నీ శ్రీని." అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు.
ఇది ఎంగేజ్మెంట్ కాదు.. !
నిన్న జరిగిన కార్యక్రమం ( మార్చి 8, 2026) చాలా మంది నిశ్చితార్థం అని భావిస్తున్న తరుణంలో, శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. ఇది కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన చిన్న అనౌన్స్‌మెంట్ మాత్రమేనని, అసలైన పెళ్లి వేడుకలు ఇంకా మొదలవ్వలేదని తెలిపారు. త్వరలోనే శుభకార్యానికి సంబంధించిన తేదీలను అధికారికంగా ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు పలువురు హాజరై ఈ కొత్త జంటను ఆశీర్వదించి విషెస్ తెలిపారు.
►ALSO READ | Mahesh Babu: జార్జియా నుంచి హైదరాబాద్‌కు మహేష్ బాబు! 'వారణాసి' నెక్స్ట్ షూటింగ్ ఎక్కడంటే?
ఎవరీ కావ్య?
సాయి శ్రీనివాస్ పరిచయం చేసిన కావ్య గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కపుల్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని , ఇరు కుటుంబాల అంగీకారంతో ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టాడానికి సిద్ధమైయ్యారు. కావ్య చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తి కాదని సమాచారం. ఆమె కుటుంబం న్యాయవృత్తితో అనుబంధం కలిగి ఉందని ప్రచారం జరుగుతోంది.
కెరీర్ పరంగా బిజీ..
అల్లుడు శీను సినిమాతో మాస్ ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 'హైందవ' ,' టైసన్ నాయుడు' వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఒకవైపు సినిమాలతో దూసుకుపోతూనే, ఇప్పుడు తన జీవిత భాగస్వామిని ఎంచుకుని వ్యక్తిగత జీవితంలోనూ కొత్త అడుగు వేస్తున్నారు. ఈ ఏడాది టాలీవుడ్‌లో జరగబోయే అత్యంత వైభవమైన వివాహాలలో ఇది ఒకటిగా నిలవబోతోంది. ఈ నేపథ్యంలో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
To my Kavyaamma,
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) March 9, 2026
Life has its own beautiful timing.. and mine bought you into my world. ❤️
Thank you for coming into my life, believing in me at right time, filling my days with positivity and countless smiles !! Will make sure that every smile on your face will never fade… pic.twitter.com/Vv9O1nxGyU
