Kotta Cinema: హైదరాబాద్‌ ఎందుకు.. సింగరేణి గడ్డపైనే సినిమా తీస్తాం..లోకల్ టాలెంట్‌తో భారీ ప్రయోగం

Kotta Cinema: హైదరాబాద్‌ ఎందుకు.. సింగరేణి గడ్డపైనే సినిమా తీస్తాం..లోకల్ టాలెంట్‌తో భారీ ప్రయోగం

సినిమా తీయాలంటే హైదరాబాద్‌‌కే రావాల్సిన అవసరం లేదని, కథలో విషయం ఉంటే ఎక్కడినుంచైనా సినిమా తీయెచ్చని నిరూపించే ప్రయత్నమే ‘కొత్త సినిమా’ (Kotta Cinema). సింగరేణి ప్రాంతానికి చెందిన లోకల్ టాలెంట్‌‌తో దర్శకుడు అజర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దాదాపు వందమంది కొత్త వాళ్లు ఈ సినిమాతో టాలీవుడ్‌‌కు పరిచయం అవుతున్నారు.

సురేశ్, రాకేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్‌‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌‌లో ‘వై ఇన్ హైదరాబాద్.. వై నాట్ ఇన్ అవర్ ప్లేస్’ పేరుతో ఒక ఈవెంట్‌‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి  దర్శక నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్ శంకర్, వీఎన్ ఆదిత్య, వీర శంకర్ అతిథులుగా హాజరై మూవీ టీమ్‌‌కు  బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అజర్ మాట్లాడుతూ ‘కొత్త వాళ్లమైనా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని త్వరలోనే  థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నాం’ అని అన్నాడు. నటులు రాకేష్, సురేశ్, మ్యూజిక్ డైరెక్టర్ పెద్దపల్లి రోహిత్,  డీవోపీ జానీ బాషా తదితరులు పాల్గొన్నారు.