గోవాలో దేవర

గోవాలో దేవర

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ‘దేవర’. జాన్వీకపూర్ హీరో యిన్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. శనివారం నుండి గోవాలో కొత్త షెడ్యూల్ మొదలైందని అప్‌‌‌‌డేట్ ఇచ్చారు మేకర్స్. సముద్రం బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ గోవాకు వెళుతూ ఎయిర్‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌లో కనిపించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ జాన్వీకపూర్ కూడా ఈ షెడ్యూల్‌‌‌‌లో జాయిన్ అవుతున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తవగానే గోకర్ణంలో నెక్స్ట్ షెడ్యూల్‌‌‌‌ ఉండబోతోందట. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది.