వస్తోంది కొత్త విజేత.. సౌతాఫ్రికా చేతుల్లోకి డబ్ల్యూటీసీ ఫైనల్‌‌..

వస్తోంది కొత్త విజేత.. సౌతాఫ్రికా చేతుల్లోకి డబ్ల్యూటీసీ ఫైనల్‌‌..
  • మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ సూపర్ సెంచరీ
  • విజయానికి 69 రన్స్ దూరంలో సఫారీలు.. సత్తా చాటిన కెప్టెన్‌‌‌‌‌‌‌‌ బవూమ

లండన్‌‌‌‌‌‌‌‌: ప్రతిష్టాత్మక వరల్డ్‌‌‌‌‌‌‌‌ టెస్టు చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ (డబ్ల్యూటీసీ)లో కొత్త విజేత రావడం దాదాపు ఖాయమైంది. డిఫెండింగ్ చాంప్‌‌‌‌‌‌‌‌ ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్‌‌‌‌‌‌‌‌ సౌతాఫ్రికా చేతుల్లోకి వచ్చేసింది. తొలి రెండు రోజులు హోరాహోరీగా సాగిన ఆటలో మూడో రోజు సఫారీ టీమ్‌‌‌‌‌‌‌‌ పూర్తిగా పైచేయి సాధించింది. ఓపెన్ ఐడెన్‌‌‌‌‌‌‌‌ మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్ (159 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 11 ఫోర్లతో 102 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీకి తోడు కెప్టెన్ టెంబా బవూమ (121 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లతో 65 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) ఫిఫ్టీతో సత్తా చాటడంతో ఆ జట్టు ఐసీసీ ట్రోఫీని అందుకునేందుకు మరో 69  రన్స్ దూరంలో నిలిచింది.  

ఆసీస్ ఇచ్చిన 282  రన్స్ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో మూడో రోజు, శుక్రవారం చివరకు సౌతాఫ్రికా 213/2  స్కోరుతో నిలిచింది. మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌, బవూమ మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు అజేయంగా 143 రన్స్ జోడించి జట్టును గెలుపు ముంగిట నిలిపారు.. స్టార్క్‌‌‌‌‌‌‌‌ (2/53) రెండు వికెట్లు పడగొట్టాడు. మరో రెండు రోజుల ఆట మిగిలున్న మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ప్రొటీస్ టీమ్ విజయానికి 69   రన్స్ అవసరం అవగా.. ఆసీస్‌‌‌‌‌‌‌‌కు వికెట్లు 8 అవసరం.

ఈ పరిస్థితుల్లో అద్భుతం చేస్తే తప్ప ఆసీస్ గెలిచే చాన్స్ లేదు.  అంతకుముందు ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 144/8తో ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 207 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. మిచెల్ స్టార్క్ (136 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లతో 58 నాటౌట్‌‌‌‌‌‌‌‌) ఫిఫ్టీతో ఆకట్టుకున్నాడు. జోష్ హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్ (17)తో పదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 59 రన్స్ జోడించాడు. సఫారీ బౌలర్లలో రబాడ నాలుగు, ఎంగిడి మూడు వికెట్లు పడగొట్టారు. 

ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో తడాఖా

తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో తేలిపోయిన సౌతాఫ్రికా బ్యాటర్లు ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో సత్తా  చాటడంతో ఆ జట్టు రేసులోకి వచ్చింది. సవాల్ విసురుతున్న వికెట్‌‌‌‌‌‌‌‌పై ఆసీస్ ఇచ్చిన ఊరించే టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో సఫారీలకు  మంచి ఆరంభం లభించలేదు. బ్యాట్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకొని బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఆసీస్ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిచెల్ స్టార్క్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మూడో ఓవర్లోనే ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (9)ను ఔట్ చేసి ఫస్ట్ బ్రేక్ సాధించాడు.

స్టార్క్ వేసిన ఫుల్ వైడ్ ఔట్‌‌‌‌‌‌‌‌ స్వింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రికెల్టన్ స్క్వేర్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ చేయబోగా అది ఎడ్జ్‌‌‌‌‌‌‌‌ తీసుకొని కీపర్ చేతిలో పడింది. అయితే, వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన వియాన్ ముల్డర్ (27) తోడుగా మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను చక్కదిద్దాడు. ఈ ఇద్దరూ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ వన్డే స్టయిల్లో వేగంగా రన్స్‌‌‌‌‌‌‌‌ రాబట్టారు. ఆసీస్ పేస్ త్రయంతో పాటు స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లైయన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ నిలకడగా ఆడారు.

అయితే, క్రీజులో కుదురుకున్న ముల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్టార్క్‌‌‌‌‌‌‌‌ వెనక్కుపంపాడు. అతను ఫిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్టంప్‌‌‌‌‌‌‌‌పై వేసిన ఫుల్ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను ముల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కవర్స్‌‌‌‌‌‌‌‌లో లబుషేన్ చేతుల్లోకి కొట్టడంతో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 61 రన్స్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. తన తర్వాతి ఓవర్లోనే స్టార్క్‌‌‌‌‌‌‌‌.. నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన బవూమ ఎడ్జ్‌‌‌‌‌‌‌‌ రాబట్టాడు. కానీ, సఫారీ కెప్టెన్ ఇచ్చిన క్యాచ్‌‌‌‌‌‌‌‌ను స్లిప్‌‌‌‌‌‌‌‌లో స్మిత్ డ్రాప్ చేయడం ఆసీస్‌‌‌‌‌‌‌‌ను దెబ్బకొట్టింది.

అప్పటికి రెండు రన్స్‌‌‌‌‌‌‌‌ వద్ద ఉన్న బవూమ ఈ లైఫ్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. క్రీజులో కుదురుకున్న మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌కు మంచి సపోర్ట్ ఇచ్చాడు. 94/2తో టీ బ్రేక్‌‌‌‌‌‌‌‌కు వెళ్లొచ్చిన తర్వాత మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌, టెంబా మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. ఆసీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. క్రమం తప్పకుండా బౌండ్రీలు కొట్టిన ఐడెన్ 69 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. బవూమ 83 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఈ మార్కు అందుకున్నాడు.

వీళ్ల జోరుతో చూస్తుండగానే స్కోరు 200 మార్కు దాటింది. ఇక, ఫ్యాన్స్ కేరింతల నడుమ హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఫ్లిక్ షాట్‌‌‌‌‌‌‌‌తో ఫోర్ కొట్టిన మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ పూర్తి చేసుకొని సఫారీలను గెలుపు ముంగిట నిలిపాడు. ఎంత ప్రయత్నించినా ఈ జోడీని విడదీయలేకపోయిన ఆసీస్‌ నిరాశగా మూడో రోజును ముగించింది.

 ఆదుకున్న స్టార్క్‌‌‌‌‌‌‌‌ 

మూడో రోజు ఆటలో  సఫారీలదే పూర్తి ఆధిపత్యం అయినా ఆరంభంలో మాత్రం ఆస్ట్రేలియా పేసర్ మిచెల్‌‌‌‌‌‌‌‌ స్టార్క్‌‌‌‌‌‌‌‌ అద్భుత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. ఆట మొదలైన మూడో ఓవర్లోనే మరో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేథన్ లైయన్ (2)ను రబాడ ఎల్బీగా ఔట్ చేయడంతో 148/9తో నిలిచిన ఆసీస్ మరో పది రన్స్ చేసి ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ, ఆ టీమ్ స్కోరు 200 దాటిందంటే అందుకు కారణం స్టార్క్‌‌‌‌‌‌‌‌. క్రీజులో పాతుకుపోయిన అతను సౌతాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్ నుంచి తనకు మంచి సపోర్ట్‌‌‌‌‌‌‌‌ లభించింది.

ఈ ఇద్దరూ ఒక సెషన్ మొత్తం క్రీజులో నిలిచారు.  టాప్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తలపించిన స్టార్క్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు మంచి షాట్లు కూడా కొట్టాడు.  రబాడ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో రెండు ఫోర్లు, యాన్సెన్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాబట్టాడు. హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్ సైతం ఒకటి రెండు షాట్లతో ఆకట్టుకున్నాడు. యానెన్స్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో మరో ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో స్కోరు 200 దాటించిన స్టార్క్ టెస్టుల్లో 11వ ఫిఫ్టీ ఖాతాలో వేసుకున్నాడు.

ఈ జోడీని విడదీసి ఆసీస్‌‌‌‌‌‌‌‌ను ఆలౌట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు సఫారీ కెప్టెన్ బవూమ.. పార్ట్‌‌‌‌‌‌‌‌టైమ్ స్పిన్నర్  మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ను బరిలోకి దించి సక్సెస్ సాధించాడు. అతని రెండో ఓవర్లో స్టార్క్‌‌‌‌‌‌‌‌ ఓ ఫోర్ రాబట్టి జోరు మీద కనిపించగా..  ఆరో బాల్‌‌‌‌‌‌‌‌ను కవర్స్ మీదుగా ఆడే ప్రయత్నం చేసిన హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్ స్లిప్‌‌‌‌‌‌‌‌లో కేశవ్ మహారాజ్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో  తొలి సెషన్‌‌‌‌‌‌‌‌లో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. 

సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 212 ఆలౌట్‌‌‌‌‌‌‌‌;  
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌:  138 ఆలౌట్‌‌‌‌‌‌‌‌;  

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 65 ఓవర్లలో 207 ఆలౌట్‌‌‌‌‌‌‌‌
(స్టార్క్ 58 నాటౌట్‌‌, క్యారీ 43, రబాడ 4/59, ఎంగిడి 3/38). 
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ (టార్గెట్‌‌‌‌‌‌‌‌ 282): 56 ఓవర్లలో 213/2 (మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్ 102 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, బవూమ 65 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, స్టార్క్‌‌‌‌‌‌‌‌ 2/53)

క్యాచ్ డ్రాప్‌‌‌‌‌‌‌‌..  స్మిత్‌‌‌‌‌‌‌‌కు గాయం, ఆసీస్‌‌‌‌‌‌‌‌కు దెబ్బ

సౌతాఫ్రికా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ బవూమ క్యాచ్ డ్రాప్ చేసిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్  జట్టు విజయావకాశాలను దెబ్బతీయడమే కాకుండా తను  తీవ్రంగా గాయపడ్డాడు. 20వ ఓవర్లో  స్టార్క్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో బవూమ ఇచ్చిన పదునైన క్యాచ్‌‌‌‌‌‌‌‌ను  స్మిత్ ఫస్ట్ స్లిప్‌‌‌‌‌‌‌‌లో అందుకోబోయి జారవిడిచాడు. ఈ క్రమంలో అతని వేలుకు గాయమైంది.

తీవ్రమైన నొప్పితో స్మిత్ గ్రౌండ్ వీడాడు. వేగంగా వచ్చిన బాల్‌‌‌‌‌‌‌‌ తగిలి స్మిత్ కుడి చేయి చిటికెన వేలు విరిగినట్టు తెలుస్తోంది. ఆసీస్ టీమ్ మెడికల్ స్టాఫ్ అతనికి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అందించి ఆ తర్వాత ఎక్స్-రే, ఇతర టెస్టుల కోసం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి తెలిపారు.

6 లార్డ్స్ స్టేడియంలో నాలుగో ఇన్నింగ్స్‌‌లో సెంచరీ చేసిన ఆరో ఫారిన్ బ్యాటర్‌‌  మార్‌‌క్రమ్. అతని కంటే ముందు బ్రాడ్‌‌మన్ (1938), గోర్డాన్ గ్రీనిడ్జ్ (1984), అజిత్ అగార్కర్ (2002), రాయ్ ఫ్రెడరిక్స్ (1976), మైకేల్ క్లార్క్​ (2009)ఈ ఘనత సాధించారు.

3  టెస్టు మ్యాచ్‌‌ల్లో నాలుగో ఇన్నింగ్స్‌‌లో ఓపెనర్‌‌గా మార్‌‌క్రమ్‌‌కు ఇది మూడో సెంచరీ. సునీల్ గావస్కర్, గ్రేమ్ స్మిత్ నాలుగేసి సెంచరీలు కొట్టారు.