‘‘నేను పుట్టాను... లోకం మెచ్చింది
నేను ఏడ్చాను... లోకం నవ్వింది
నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది.. డోంట్ కేర్..’’
అప్పుడే పుట్టిన ఒక బుడ్డోడు ఈ లిరిక్స్ను నిజం చేశాడు. తొక్కలో లైఫ్.. పుట్టాంలే.. ఇప్పుడేంటయితే.. అనే రీతిలో అప్పుడే పుట్టిన బుడ్డోడు తలకింద రెండు చేతులు పెట్టుకుని, కాలి మీద కాలేసుకుని పడుకున్న ఫోజ్కు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈజిప్ట్లోని కైరోలో అప్పుడే పుట్టిన పిల్లాడు ఇలా రాయల్ ఫోజ్ లో కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది.
#VIDEO: Born unbothered! A newborn in Cairo, Egypt, has gone viral for his unusually relaxed pose shortly after birth, lying with his hands behind his head and legs crossed. Egyptian pediatrician Dr. Islam Eldeh dubbed the position the “royal pose,” amusing millions online. https://t.co/Xpgskf8e3J
— Saudi Gazette (@Saudi_Gazette) October 18, 2026
ఈ బుడ్డోడికి హెల్త్ చెక్ చేసిన ఈజిప్ట్ పిల్లల డాక్టర్ ఇస్లాం ఎల్దేహ్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పుడే లైఫ్ను చూసేశాడని.. చిల్ అవుతున్నాడని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్గా మారాయి. బుడ్డోడు ఎంతో ప్రశాంతంగా, నిశ్చింతగా పడుకుని కనిపించడం చూసి, బుడ్డోడు చిల్ అవుతూ ఏం ఆలోచిస్తున్నాడోనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
సాధారణంగా నవజాత శిశువులు గుక్క పట్టి ఏడవడం, ఒళ్ళు విరుచుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ ఈ చిన్నారి రిలాక్ట్స్గా కనిపించడం మాత్రం కాస్త భిన్నంగా కనిపించింది. రెస్ట్ తీసుకుంటున్నట్టుగా పసికందు కనిపించిన తీరు వైద్యులనే విస్మయానికి గురిచేసింది.
