ఎప్పుడైనా.. ఏమైనా జరగొచ్చు.. ఓవైసీకి వార్నింగ్​

ఎప్పుడైనా.. ఏమైనా జరగొచ్చు.. ఓవైసీకి వార్నింగ్​

హైదరాబాద్​ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్​కి వార్నింగ్​ ఇస్తున్న వ్యక్తి వీడియో సోషల్​ మీడియాలో వైరల్ గా మారింది. అందులో గుర్తు తెలియని వ్యక్తి అసద్​టార్గెట్​గా మాట్లాడుతుండటం కనిపిస్తోంది. వీడియోలోని వివరాల ప్రకారం.. అసద్​ అక్రమంగా కేసులు పెట్టి కొందరిని ఇబ్బంది పెడుతున్నాడని ఉర్దూలో అంటున్నాడు. 

మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్​గాంధీలకు కల్పించిన సెక్యూరిటీలే వారిని కాపాడలేక పోయాయి.. ప్రధాని మోదీ అసద్​కి వై ప్లస్​ సెక్యూరిటీ కల్పించినా కాపాడలేరని వీడియోలోని వ్యక్తి బెదిరించాడు. అతనికి ఎప్పుడైనా.. ఏమైనా జరగొచ్చని అనడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో తాలూకు వివరాలు ఆ వ్యక్తి ఎవరో కనుక్కునే పనిలో పోలీసులు ఉన్నారు.