యూనిక్ గా ‘దుర్గా రైజెస్’ నయా కలెక్షన్

యూనిక్ గా ‘దుర్గా రైజెస్’ నయా కలెక్షన్
  • సెల్ఫ్ ఎంపర్​మెంట్ తెలియజేసేలా డిజైన్లు: ప్రముఖ ఆర్టిస్టు, ఫ్యాషన్ డిజైనర్ వెంకట్ గడ్డం
  • తాజ్​కృష్ణాలో జరిగిన ఫ్యాషన్ యాత్ర ప్రివ్యూ షోలో కొత్త కలెక్షన్లు రిలీజ్

హైదరాబాద్‌‌, వెలుగు: ఇన్నర్ బ్యూటీ, సెల్ఫ్ ​ఎంపర్​మెంట్​ను తెలియజేసేలా  ‘దుర్గా రైజెస్’ బ్రాండ్ కొత్త కలెక్షన్లు ఉంటాయని ప్రముఖ ఆర్టిస్టు, ఫ్యాషన్ డిజైనర్ వెంకట్ గడ్డం తెలిపారు. బంజారాహిల్స్​లోని తాజ్​కృష్ణాలో ‘ఫ్యాషన్ యాత్ర’ పేరుతో శనివారం ఎగ్జిబిషన్ జరగనుండగా.. ఇందుకు సంబంధించిన ప్రివ్యూ షోను శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను రూపొందించిన ‘దుర్గా రైజెస్’ బ్రాండ్ నుంచి నయా కలెక్షన్లను వెంకట్ గడ్డం రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శనివారం జరగనున్న ఎగ్జిబిషన్​లో ‘వెన్ కట్ గాడ్ డామ్’ స్టాల్​లో ఈ కొత్త కలెక్షన్లు అందుబాటులో ఉంటాయన్నారు.

 హ్యాండ్ పెయింటింగ్​తో రూపొందించిన మెన్ అండ్ విమెన్, కిడ్స్​వేర్​కు సంబంధించిన లాంగ్ జాకెట్స్, ఫ్రాక్స్, వెస్ట్రన్ గౌన్స్, ట్యూనిక్స్, శారీస్, షర్ట్స్ ను ఎగ్జిబిషన్​లో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. అన్ని ఏజ్ గ్రూప్ ల వారికి ఫ్యాషనబుల్ గా ఉండేలా యూనిక్ గా ‘దుర్గా రైజెస్’ కొత్త కలెక్షన్లు ఉంటాయని  ఆయన వివరించారు. సస్టెనయిబుల్ కాటన్, మాల్ కాటన్, సిల్క్, ఫ్యాబ్రిక్ మీద, వాల్​పై వేసే ఆర్ట్​ను.. డ్రెస్సులపై, తన ఓన్ డిజైనింగ్ వేర్​పై వేయడం స్పెషాలిటీ అని ఆయన చెప్పారు. ఇవ్వాల జరగనున్న ఎగ్జిబిషన్​లో ఈ ఆర్ట్​ను చూడొచ్చని వెంకట్ గడ్డం తెలిపారు. బంజారాహిల్స్​రోడ్ నం.10లోని స్టోర్ లో కూడా కొత్త కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.  తాజ్ కృష్ణాలో ఇయ్యాల ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు  ఫ్యాషన్ యాత్ర పేరుతో ఎగ్జిబిషన్ జరగనుండగా.. వివిధ రాష్ట్రాలకు చెందిన డిజైనర్ల డ్రెస్ లు, జువెలరీ, హోం డెకార్స్ ను ప్రదర్శించనున్నారు.