ఫొటో షూట్ లో  నవ్వులు పూయిస్తున్న  లవ్ ప్రపోజల్ 

ఫొటో షూట్ లో  నవ్వులు పూయిస్తున్న  లవ్ ప్రపోజల్ 

లవ్ ప్రపోజల్.. ప్రేమికుల జీవితంలో ఒక ముఖ్య ఘట్టం. తమకు నచ్చిన అబ్బాయికి లేదా అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేసిన రోజు, సమయం ఆ ప్రేమికులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ప్రేమను వ్యక్తపరచడం కూడా డిఫరెంట్ స్టైల్లో చెప్పుకుంటున్నారు చాలామంది ప్రేమికులు. ఓ యువతి తన ప్రియుడికి లవ్ ప్రపోజల్ చేస్తున్న  ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తోంది. ఓ మహిళ తన ప్రియుడికి లవ్ ప్రపోజ్ చేస్తుండగా వారితో పాటే వచ్చిన ఆమె సోదరి ఎడ్వర్డ్స్ ఫొటో షూట్ చేస్తుండగా కిందపడిపోయింది. ఇలా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు..ఏకంగా మూడుసార్లు కిందపడిపోయింది. ఆ సమయంలో పైకి లేచేందుకు ఆమె చాలాసేపు ప్రయత్నించింది. కానీ, పైకి లేచే సమయంలో మళ్లీ మళ్లీ పడిపోయింది. అప్పుడు అక్కడే ఉన్న ప్రేమికులు ఈ లోకాన్ని మరిచి.. ప్రేమమైకంలో మునిగి తేలిపోయారు. కిందపడిపోయిన సోదరిని పైకి లేపేందుకు ఆమె ప్రయత్నించలేదు. 

https://twitter.com/TansuYegen/status/1549493046361956353

తన సోదరి ఆమె ప్రియుడికి ఐ లవ్ యూ అని చెప్పే సమయంలో మాత్రం సరిగ్గా షూట్ చేయలేకపోయింది. దీంతో ఆ జంట కాస్త డిసప్పాయింట్ అయినట్లు వీడియో బట్టి అర్థమవుతోంది. చాలా మంది ఇప్పుడు ఈ వీడియోను చూసి తెగ నవ్వుకుంటున్నారు. ఈ ఘటన సౌతాఫ్రికాలో జరిగినట్టు తెలుస్తోంది. అయితే..ఆమె కావాలనే చేసిందా.. లేదంటే నిజంగానే పడిపోయిందా..? అనేది మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికి ఈ వీడియో అందరినీ తెగ నవ్విస్తోంది.