
థియేటర్స్ లో హనుమాన్(HanuMan) సినిమా వీరవిహారం ఇంకా తగ్గడం లేదు. సినిమా విడుదలై 15 రోజులు గడుస్తున్నా కలెక్షన్స్ జోరు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికి చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ఈ మూవీ. ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన హనుమాన్ మూవీ త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్ లో చేరబోతోందని ట్రేడ్ వర్గాల అంచనా. కేవలం ఇండియాలోనే కాదు ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది హనుమాన్ మూవీ. అక్కడి 15 రోజులకు గాను ఏకంగా 5 మిలియన్ కలెక్షన్స్ రాబట్టి టాప్ స్టార్స్ కు సైతం సాధ్యం కానీ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
What you have cooked @PrasanthVarma
— AA Cult ?? (@1_bunnyfreak) January 29, 2024
You should see this ??#HanuMan pic.twitter.com/Ry9KyIA0jA
ఇక ఆడియన్స్ హనుమాన్ సినిమాను థియేటర్స్ లో చూసి ఊగిపోతున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమంతుడిని చూపించిన విధానానికి ప్రేక్షకులు మంత్రముగ్దులు అవుతున్నారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హనుమాన్ సినిమా చూడాటానికి వచ్చిన ఒక మహిళా సినిమా చూస్తూ పూనకంతో ఊగిపోయింది. పక్కన వాళ్ళు ఎంత ఆపిన ఆగలేదు. ఎదో చిత్రవిచిత్రంగా అరుస్తూ.. పూనకంతో ఊగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీలుంటే మీరు కూడా చూసేయండి