ప్రేమోన్మాది దాడిలో గాయపడిన కోలుకుంటున్న యువతి

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన కోలుకుంటున్న యువతి

నల్గొండ పట్టణంలోని ప్రేమోన్మాది దాడిలో గాయపడిన నవ్య కోలుకుంటుంది. ప్రస్తుతం నవ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్లర్లు తెలిపారు. నిన్న నల్గొండ పట్టణం ఫారెస్ట్ పార్క్ దగ్గర ప్రేమ పేరుతో యువతిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు ఓ యువకుడు. రోహిత్ అనే యువకుడు ఏడు నెలల నుంచి నవ్య అనే అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. నవ్య తన ఫ్రెండ్ శ్రేష్టతో ఫారెస్ట్ పార్క్ దగ్గర సాయి అనే స్నేహితుడిని కలిసేందుకు వెళ్లింది.

సాయితో పాటు నవ్యను సతాయిస్తున్న రోహిత్ కూడా అక్కడికి చేరుకున్నాడు. నవ్యను మాట్లాడాలంటూ పక్కకు తీసుకెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై విచక్షణ రహితంగా కడుపు, కాళ్లు, చేతులు, మొఖంపై పొడిచి పారిపోయాడు. కొద్ది దూరంలో ఉన్న సాయి, శ్రేష్ట.... నవ్యను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం నవ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. మరోవైపు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.