ఆది సాయికుమార్ హీరోగా నవరసన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. త్రిశూల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రశాంత్ జి రుద్రప్ప నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. దట్టమైన చీకటితో నిండిన అడవిలో త్రిశూలాన్ని చుట్టుకుని పడగ విప్పిన నాగుపాము, దాని చుట్టూ రకరకాల ఆయుధాలతో డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఉత్కంఠను రేపుతోంది.
దైవిక రహస్యాల నేపథ్యంలో సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి డివైన్ మిస్టరీ థ్రిల్లర్గా రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ‘శంభాల’ లాంటి మిస్టిక్ థ్రిల్లర్ తర్వాత ఆది మరోసారి ఈ తరహా థ్రిల్లర్లో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి నెలకొంది. కాంతార, విరూపాక్ష చిత్రాలకు సంగీతం అందించిన బి. అజనీష్ లోక్నాథ్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఈనెల 20న ఈ పాన్ ఇండియా మూవీ నెక్స్ట్ అప్డేట్ను రివీల్ చేయబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు.
