
సిద్ధార్థ్ హీరోగా శరత్ కుమార్, దేవయాని కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రీ బీహెచ్‌కే’. శ్రీగణేష్ దర్శకత్వంలో అరుణ్ విశ్వ తెలుగు,- తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 4న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం ‘ఆగిపోను నేను’ అంటూ సాగే సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అమృత్ రామ్‌నాథ్ సాంగ్‌ని కంపోజ్ చేయగా, దేవ లిరిక్స్ రాయడంతో పాటు ఎనర్జిటిక్‌గా పాడాడు. మూవీ థీమ్‌ని ప్రజెంట్ చేసిన ఈ పాటలో సిద్ధార్థ్ డిఫరెంట్ లుక్స్‌లో ఆకట్టుకున్నాడు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయని దర్శక నిర్మాతలు చెప్పారు. యోగి బాబు, మీఠా రఘునాథ్ , చైత్ర ఇతర పాత్రలు పోషించారు.