60 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి ఆమీర్ ఖాన్ రెడీ.. ఎవరీ గౌరీ స్ప్రాట్?

60 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి ఆమీర్ ఖాన్ రెడీ.. ఎవరీ గౌరీ స్ప్రాట్?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి రెడీ అవుతున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.  గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్లకు తెరదించుతూ.. 60 ఏళ్ల ఆమిర్ ఖాన్ తనకంటే 12 ఏళ్లు చిన్నదైన గౌరీ స్ప్రాట్ (47) తో కలిసి వివాహబంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. వచ్చే నెల జూలై 5న వీరిద్దరి రిజిస్టర్ మ్యారేజ్ జరగబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది.  లేటు వయసులో వీరి పెళ్లి సినీ ఇండస్ట్రీలో  హాట్ టాపిక్ గా మారింది.

సింపుల్‌గా.. ప్రైవేట్‌గా..!

గతంలో రీనా దత్తా, కిరణ్ రావులతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న ఆమిర్‌కు గౌరి స్ప్రాట్ పరిచయమైంది. వీరిద్దరి మధ్య బాండింగ్ కుదరడంతో, ఈ బంధాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు.  అయితే ఈసారి మాత్రం హంగామాకు దూరంగా ఉండాలని ఆమిర్ నిర్ణయించుకున్నారు. ముంబైలోని ఆయన నివాసంలోనే అత్యంత ఆత్మీయులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. ఈ క్రేజీ వెడ్డింగ్‌కు బాలీవుడ్ ఖాన్స్.. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లు కూడా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.   ఒకవేళ ఇదే నిజమైతే... ముగ్గురు ఖాన్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ ఇవ్వడం ఖాయం. 

ఎవరీ గౌరీ స్ప్రాట్?

గౌరీ స్ప్రాట్ కేవలం ఆమిర్ పార్ట్నర్ మాత్రమే కాదు.. ఆమెకు ఒక గొప్ప హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఆమె తాతగారు ఫిలిప్ స్ప్రాట్ బ్రిటన్ దేశస్థుడైనప్పటికీ, 1920ల్లోనే భారతదేశానికి వచ్చి ఇక్కడి కమ్యూనిస్ట్ ఉద్యమంలో, భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. గౌరీకి గత వివాహం ద్వారా ‘క్విన్’ అనే ఏడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.

గతాన్ని మర్చి.. 

ఆమిర్ ఖాన్‌కు ఇది మూడో వివాహం. గతంలో రీనా దత్తా, కిరణ్ రావులతో ఆయనకు విడాకులైన సంగతి తెలిసిందే. విడాకులు తీసుకున్నప్పటికీ కిరణ్ రావుతో ఆమిర్ ఇప్పటికీ మంచి స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నారు. కొడుకు ఆజాద్ బాధ్యతలను ఇద్దరూ కలిసే చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది తన బర్త్ డే ఈవెంట్‌లో గౌరీని మీడియాకు పరిచయం చేశారు ఆమిర్. అప్పటినుంచే వీరిద్దరి కెమిస్ట్రీపై నెట్టింట చర్చ మొదలైంది.

కొత్త లైఫ్ వైపు..

 ఆమిర్ ఖాన్, గౌరీలు ప్రస్తుతం ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని, లైఫ్‌లో చాలా హ్యాపీ స్పేస్‌లో ఉన్నారు. అందుకే ఎలాంటి ఆర్భాటం లేకుండా, కేవలం తమ బంధాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికే ఈ సింపుల్ మ్యారేజ్ డిసైడ్ చేసుకున్నారు అని ఆమిర్ సన్నిహితులు చెప్తున్నారు. ఏది ఏమైనా, 60 ఏళ్లకు చేరువవుతున్న వయసులో గౌరీతో కలిసి ఆమిర్ ఖాన్ సరికొత్త జీవితాన్ని ప్రారంభించబోతుండటం ఇప్పుడు సినిమా ప్రపంచంలో మోస్ట్ వైరల్ న్యూస్‌గా మారింది.  ఇప్పుడు గౌరి రాకతో ఆమిర్ ఖాన్ జీవితంలో సరికొత్త చాప్టర్ మొదలుకాబోతోంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.