కూతురి పెళ్ళిలో కన్నీళ్లు పెట్టుకున్న ఆమిర్ ఖాన్.. వైరల్ అవుతున్న వీడియో

కూతురి పెళ్ళిలో కన్నీళ్లు పెట్టుకున్న ఆమిర్ ఖాన్.. వైరల్ అవుతున్న వీడియో

ఎంత స్టార్స్ అయినా వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. వారికి కూడా అందరిలాగే అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కాకపోతే విభాల్లా పర్సనల్ లైఫ్ గురించి బయటకు తెలియకపోవడం వల్ల వాళ్ళు ఎమోషనల్ అయినా సందర్భాలు తక్కువగా కనిపిస్తాయి. తాజాగా అలాంటి సందర్భమే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీక్ ఖాన్(Aamir khan) ను ఎదురైంది. తాజాగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తనను వదిలి అత్తారింటికి వెళుతుంటే చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆమీర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. అమీర్‌ ఖాన్‌ – రీనా దత్తా కూతురు ఐరా ఖాన్‌ (Ira Khan) వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ప్రియుడు నుపుర్ శిఖరే (Nupur Shikhare)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత వారమే వీరి వివాహం ముంబైలో ఘనంగా జరిగింది. తాజాగా ఈ జంట మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా అమీర్‌ ఖాన్‌ భావోద్వేగానికి లోనయ్యారు.పెళ్ళిలో భాగంగా వధూవరులు ఉంగరాలు మార్చుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు ఆమీర్. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఎంత స్టారైనా అతను ఒక మనిషే కదా.. అతనికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి.. అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఆమీర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన... కాంపియోన్స్ అనే స్పానిష్ మూవీ రీమేక్ లో నటిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ అనిష్క శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. అనంతరం మొఘల్ అనే పీరియాడికల్ డ్రామాలో నటిస్తున్నారు ఆమిర్. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.