ఒకే కారులో అమీర్ ఖాన్, ఇద్దరు మాజీ భార్యలు, కాబోయే భార్య.. మిస్టర్ పర్ఫెక్ట్ క్రేజీ ఫ్యామిలీ రిలేషన్స్ వీడియో వైరల్!

ఒకే కారులో అమీర్ ఖాన్, ఇద్దరు మాజీ భార్యలు, కాబోయే భార్య.. మిస్టర్ పర్ఫెక్ట్  క్రేజీ ఫ్యామిలీ రిలేషన్స్ వీడియో వైరల్!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సినిమాతో కాదు, తన క్రేజీ అండ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యామిలీ రిలేషన్స్‌తో.  బాలీవుడ్ హిస్టరీలోనే క్లాసిక్‌గా నిలిచిన 'లగాన్' సినిమా రిలీజై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ ఈవెంట్ కాస్తా అమీర్ ఖాన్ ఫ్యామిలీ రీయూనియన్‌గా మారిపోయింది. ఈ వేడుక ముగిసిన తర్వాత అమీర్ ఖాన్ తన ఇద్దరు మాజీ భార్యలు, కాబోయే భార్యతో కలిసి ఒకే కారులో ఇంటికి బయలుదేరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు.. 

వైరల్ అవుతున్న ఈ వీడియోలో అమీర్ ఖాన్ కారు ముందు సీట్లో కూర్చోగా.. వెనుక సీట్లో ఆయన మొదటి మాజీ భార్య రీనా దత్తా, రెండో మాజీ భార్య కిరణ్ రావు, అలాగే త్వరలోనే పెళ్లాడబోతున్న భార్య గౌరీ స్ప్రట్ కలిసి కూర్చున్నారు. వీరితో పాటు అమీర్ చిన్న కుమారుడు ఆజాద్ కూడా ఉన్నాడు. కారులో కిరణ్ రావు, గౌరీ స్ప్రట్ ఇద్దరూ కలిసి నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

నెటిజన్లు షాక్..

ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ రేంజ్ 'సహృద్భావ వాతావరణం' చూసిన నెటిజన్లు క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు.  అబ్బా.. ఎంత అన్యోన్యంగా ఉంది మిస్టర్ పర్ఫెక్ట్  క్రేజీ ఫ్యామిలీ రిలేషన్స్ అని కొందరంటున్నారు. పిల్లల కోసం ఇంత మెచ్యూర్డ్‌గా ఉండటం గ్రేట్ అంటూ మరికొందరు అమీర్ ఖాన్ బాండింగ్‌ను మెచ్చుకుంటున్నారు.

 

'లగాన్'తో కనెక్షన్..

నిజానికి ఈ ముగ్గురు మహిళలకు 'లగాన్' సినిమాతో విడదీయరాని సంబంధం ఉంది. 1986లో రీనా దత్తా ను అమీర్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. వీరికి జునైద్, ఐరా ఖాన్ అనే పిల్లలు ఉన్నారు. లగాన్ సినిమాకు రీనానే ప్రొడ్యూసర్. ఈ ఈవెంట్‌లో ఐరా ఖాన్ మాట్లాడుతూ.. మా అమ్మ వల్లే ఇంతటి అద్భుతమైన సినిమా సాధ్యమైంది అంటూ ఎమోషనల్ అయ్యింది. వీరు 2002లో విడాకులు తీసుకున్నారు. లగాన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడే అమీర్‌తో కిరణ్ రావుకు పరిచయం అయ్యింది. 2005లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో విడిపోయారు. అయినప్పటికీ కొడుకు ఆజాద్ కోసం ఇద్దరూ కలిసే ఉంటున్నారు.

మూడో పెళ్లికి రెడీ..

ఇక బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రట్, అమీర్ ఖాన్‌కు గత 25 ఏళ్లుగా తెలుసు. గత 18 నెలలుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ముంబైలో సెలూన్ బిజినెస్ రన్ చేస్తున్న గౌరీని.. జూలై 5న అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు గట్టిగా టాక్ నడుస్తోంది. విడాకులు తీసుకున్నాక కూడా మాజీలతో ఇంతటి బంధాన్ని మెయింటైన్ చేయడం ఒక్క అమీర్ ఖాన్‌కే సాధ్యమంటూ బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. జూలైలో జరగబోయే అమీర్ మూడో పెళ్లికి ఈ మాజీ భార్యలిద్దరూ ఫ్రంట్ సీట్లో కూర్చున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు నెటిజన్లు..