Abhishek Bachchan : ఎమోష‌న‌ల్‌గా అభిషేక్ బచ్చన్ 'కాళీధర్ లాపతా' మూవీ ట్రైలర్‌‌‌‌

Abhishek Bachchan : ఎమోష‌న‌ల్‌గా అభిషేక్ బచ్చన్ 'కాళీధర్ లాపతా' మూవీ ట్రైలర్‌‌‌‌

అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘కాళీధర్ లాపతా’.  మధుమిత దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌‌ సమర్పణలో ఎమ్మయ్ ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్‌‌ సంస్థ నిర్మించింది. థియేటర్స్‌‌లో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. శనివారం ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. కాళీధర్ అనే వృద్ధుడి చుట్టూ తిరిగే కథ ఇది. అభిషేక్ బచ్చన్ ఆ పాత్రను పోషించాడు. కుటుంబ సభ్యుల తిరస్కారానికి గురైన కాళీధర్‌‌‌‌ ఎవరికీ తెలియకుండా ఇంటి నుంచి పారిపోయి వస్తాడు. అనుకోకుండా అతనికి ‘బల్లు’ అనే ఎనిమిదేళ్ల అనాథ కుర్రాడితో పరిచయం అవుతుంది. అప్పటివరకూ తన జీవితంలో కోల్పోయిన చిన్న చిన్న ఆనందాలు,  అనుభూతులను బల్లూ అతనికి చవిచూపిస్తాడు. 

మరోవైపు కుటుంబ సభ్యులు తనను వెతుకుతున్నారని తెలుస్తుంది.  ఈ క్రమంలో కాళీధర్, బల్లు ప్రయాణం ఎలాంటి మలుపు తిరిగింది అనేది మిగతా కథ. ప్రస్తుత సమాజంలో లోపిస్తున్న మానవ సంబంధాలు, కుటుంబ విలువల నేపథ్యంలో మనసుకు హత్తుకునే భావోద్వేగాలకు సునిశిత హాస్యం జోడించి తెరకెక్కించినట్టు ట్రైలర్‌‌‌‌ను చూస్తే అర్థమవుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌‌ దైవిక్ భగేలా, జీషన్ అయూబ్‌‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం  జులై 4 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.