చెపాక్‌లో 'విజిల్ పోడు' ట్రోల్స్.. సీఎస్‌కే ఫ్యాన్స్‌ను ఆటపట్టించిన అభిషేక్ శర్మ తల్లి

చెపాక్‌లో 'విజిల్ పోడు' ట్రోల్స్.. సీఎస్‌కే ఫ్యాన్స్‌ను ఆటపట్టించిన అభిషేక్ శర్మ తల్లి

SRH vs CSK: చెపాక్ మైదానంలో సోమవారం ( 2026, మే 18న) రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సాధించిన ఘన విజయం ఆ జట్టు అభిమానుల్లో మిన్నంటిన సంబరాలను తెచ్చింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకోగా, డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. కానీ, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో నెట్టింట విపరీతంగా ట్రోల్ అవుతోంది.

చెన్నై ఫ్యాన్స్‌ను ట్రోల్ అభిషేక్ శర్మ తల్లి: 
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ హిట్టర్ అభిషేక్ శర్మ కుటుంబ సభ్యులు ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు చెన్నై వచ్చారు. హైదరాబాద్ విజయం సాధించిన వెంటనే అభిషేక్ శర్మ సోదరి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో అభిషేక్ శర్మ తల్లి సీఎస్‌కే జట్టు పసుపు (Yellow) కలర్ విజిల్ ఊదుతూ ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంది. సీఎస్‌కే ఫ్యాన్స్ ఆర్మీ వాడే "విజిల్ పోడు" స్లోగన్‌ను కౌంటర్ చేస్తూ ఆమె సరదాగా చేసిన ఈ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మైదానంలో ఇషాన్ కిషన్ 'విజిల్ పోడు' సైగలు!
కేవలం స్టాండ్స్‌లోనే కాదు, మైదానంలో కూడా సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గట్టి కౌంటరే పడింది. ఈ మ్యాచ్‌లో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. విజయం అనంతరం చెన్నై క్రౌడ్ వైపు చూస్తూ నోటితో విజిల్ వేస్తున్నట్లు ‘విజిల్ పోడు’ గెస్టర్ (సైగలు) చేస్తూ కెమెరాలకు చిక్కాడు. చెన్నై గుండెకాయ వంటి చెపాక్‌లోనే హోమ్ టీమ్‌ను ఓడించి, వారి స్టైట్ లోనే సన్‌రైజర్స్ ప్లేయర్స్ ఇలా కౌంటర్లు ఇవ్వడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.