విజయ్, సంగీత దంపతులకు ఎంత మంది పిల్లలు.. ఆస్తిపాస్తులెంత ?

విజయ్, సంగీత దంపతులకు ఎంత మంది పిల్లలు.. ఆస్తిపాస్తులెంత ?

మరికొద్ది రోజుల్లో ఎన్నికలకు వెళ్లాలని గ్రౌండ్ లెవెల్ లో పార్టీని సిద్దం చేస్తున్న తమిళ వెట్రిగల్ కజగం (TVK) అధినేత, నటుడు విజయ్ కు ఇది మామూలు షాక్ కాదు. రాజకీయ ప్రత్యర్థులతో తలపడుతున్న సమయంలో.. ఇంట్లో మొదలైన కుంపటి పెద్ద కార్చిచ్చులా మారడం విజయ్ ఊహించి ఉండడు. ఆయన భార్య సంగీత విడాకులకు పిటీషన్ వేయడంతో తమిళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 

విజయ్-సంగీత దంపతులకు1999లో పెళ్లయింది. అంటే  దాదాపు 25 ఏళ్ల దాంపత్య జీవితం వీళ్లది. ఇన్నాళ్ల తర్వాత.. సంగీత విడాకులకు అప్పీల్ చేయడం షాకింగ్ విషయమే. అయితే వీళ్ల ఫ్యామిలీ, పిల్లలు, ఆస్తి పాస్తులు మొదలైన వివరాలేంటో తెలుసుకుందాం.

విజయ్-సంగీత వివాహం 1999 ఆగస్టు 25 న జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. 2000 సంవ్సరంలో జేసన్ సంజయ్, 2005 లో దివ్య సాహ జన్మించారు. జేసన్ ఇటీవలే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. డైరెక్టర్ గా సినిమా కూడా మొదలైంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తమిళ-తెలుగు యాక్షన్-అడ్వెంచర్ చిత్రం సిగ్మాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు . సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి థమన్ ఎస్ సంగీతం అందించాడు.

విజయ్, సంగీత ఆస్తులు:

తండ్రి వారసత్వంతో తమిళ సినీ పరిశ్రమలోకి వచ్చిన విజయ్.. సొంతంగా బ్రాండ్ క్రియేట్ చేసుకుని అగ్రహీరోల్లో ఒకరిగా ఎదిగారు. ఈ క్రమంలో విజయ్ మంచి రెమ్యూనరేషన్స్, యాడ్స్ తో బాగానే సంపాదించాడనే చెప్పాలి. వన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. విజయ్ నెట్ వర్త్ 600 కోట్లు ఉంటుంది. ఇండియాలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటులలో విజయ్ ఒకరు. ఒక్కో సినిమాకు వంద నుంచి 120 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్. 

ఇంతే కాకుండా విజయ్ ఫ్యామిలీకి చెన్నై బీచ్ ఏరియా నీలంకరీ లో కాసురినా డ్రైవ్ అనే ఇల్లుంది. బంగాళాఖాతం ఒడ్డున ఉన్న ఈ ఇల్లు అత్యంత మోడ్రన్ డిజైన్ ఉన్నట్లు చెప్తుంటారు. ఈ బంగ్లా విలువ సుమారు 80 కోట్లు ఉంటుందని అంచనా. అంతే కాకుండా 7 కోట్ల విలువైన లగ్జరీ రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కూడా ఉంది విజయ్ కి. అదేవిధంగా BMW Series 5, ఆడి A8, మినీ కూపర్ లాంటి హై ఎండ్ కార్లు ఉన్నాయి.

విజయ్ భార్య సంగీత రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. యూకే బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సంగీతకు..  విడిగా దాదాపు 400 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు సమాచారం. లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే ఆమె.. ఆస్తులు కలిగి ఉండటంతో పాటు.. పెట్టుబడులు కూడా పెడుతుంటుందని టాక్ .