డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్ట్

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్ట్

బాలీవుడ్ యాక్టర్ అజాజ్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ కేసులో అజాజ్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు. నిన్న సాయంత్రం ముంబై ఎయిర్ పోర్టులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. 8 గంటల సుధీర్ఘ విచారణ తర్వాత అజాజ్ ను అరెస్ట్ చేశారు. అంతకుముందు అజాజ్ ఖాన్ కు చెందిన రెండు ఇళ్లల్లో సోదాలు చేశారు నార్కోటిక్స్ అధికారులు. డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు దొరకడంతో అరెస్ట్ చేశామంటున్నారు. అయితే తనను అన్యాయంగా కేసులో ఇరికించారంటున్నారు అజాజ్ ఖాన్. తన ఇంట్లో  నాలుగు నిద్రమాత్రలే దొరికాయన్నారు. కొంత కాలంగా డిప్రెషన్ తో బాధపడ్తున్న తన వైఫ్... స్లీపింగ్ పిల్స్ వాడుతోందన్నారు. ఇక అజాజ్ ఖాన్ ను కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు హెల్త్ చెకప్ కు తీసుకెళ్లారు నార్కోటిక్స్ అధికారులు.