అల్లు శిరీష్ పెళ్లికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

అల్లు శిరీష్ పెళ్లికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ చిన్న కుమారుడు, నటుడు అల్లు శిరీష్‌, నయనిక వివాహం శుక్రవారం(మార్చి6)  ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో అల్లు శిరీష్​,నయనికల వివాహం గ్రాండ్​గా నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లు  వివాహవేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

అల్లువారి ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఒకవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంటే, అదే శుభముహూర్తాన ఆయన తమ్ముడు, హీరో అల్లు శిరీష్ తన ప్రేయసి నయనికతో కలిసి ఏడడుగుల బంధంలోకి అడుగు పెట్టాడు. మార్చి 6వ తేదీ అల్లు కుటుంబ చరిత్రలో ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోనుంది.  అల్లు అభిమానులకు ఇది పండుగా మారింది.

అల్లు అర్జున్ తన ప్రేమను గెలిపించుకుని 2011 మార్చి 6న స్నేహారెడ్డిని ఎలాగైతే పెళ్లాడారో, సరిగ్గా 15 ఏళ్ల తర్వాత అదే తేదీన శిరీష్ తన మనసు గెలిచిన నయనికను వివాహం చేసుకోవడం విశేషం. అల్లు అరవింద్ చిన్న కుమారుడిగా, టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న శిరీష్.. ఇప్పుడు ఒక ఇంటివాడు కావడంతో అల్లు కాంపౌండ్‌లో సంబరాల్లో తేలిపోయింది.