బుధవారం వరకు మహాప్రస్థానంలోనే చలపతిరావు భౌతికకాయం

బుధవారం వరకు మహాప్రస్థానంలోనే చలపతిరావు భౌతికకాయం

సినీ నటుడు చలపతిరావు పార్థివదేహాన్ని  జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి తరలించారు. బుధవారం వరకు పార్దీవదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. చలపతిరావు కుమార్తెలు అమెరికా నుండి వచ్చే వరకు మహాప్రస్థానంలోని ఫ్రీజర్లోనే భౌతికకాయాన్ని ఉంచనున్నారు. బుధవారం చలపతిరావు అంత్యక్రియలు జరగనున్నాయి.

చలపతిరావు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చలపతిరావు మృతి పట్ల పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు. చలపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు ఒక్కొక్కరుగా చలపతిరావు కుమారుడు రవిబాబు ఇంటికి చేరుకుంటున్నారు.