ధనరాజ్ దర్శకత్వంలో సముద్రఖని లీడ్‌‌ రోల్‌‌లో ఓ చిత్రం

ధనరాజ్ దర్శకత్వంలో సముద్రఖని లీడ్‌‌ రోల్‌‌లో  ఓ చిత్రం

సముద్రఖని లీడ్‌‌ రోల్‌‌లో నటుడు ధనరాజ్ తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నారు. తండ్రి కొడుకుల ఎమోషన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఫస్ట్ షాట్‌‌కు శివబాలాజీ క్లాప్ కొట్టగా, దర్శకుడు సుబ్బు కెమెరా స్విచాన్ చేశాడు. 

‘బలగం’ వేణు గౌరవ దర్శకత్వం వహించాడు. సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, మధునందన్ , భూపాల్, పృద్వి, రాకెట్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. తండ్రి కొడుకులుగా సముద్రఖని, ధనరాజ్ నటిస్తుండగా మోక్ష , హరీష్ ఉత్తమన్, పృథ్వి, అజయ్ ఘోష్, లావణ్య రెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ‘విమానం’ దర్శకుడు శివ ప్రసాద్ యానాల దీనికి కథ మాటలు అందిస్తున్నాడు. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు. నవంబర్ 9నుండి  రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.