ప్రభాసే నా కాళ్ళు పట్టుకున్నాడు.. సలార్ నటుడి కామెంట్స్ వైరల్

ప్రభాసే నా కాళ్ళు పట్టుకున్నాడు.. సలార్ నటుడి కామెంట్స్ వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. కొంతకాలంగా సరైన హిట్టులేక సతమవుతున్న ప్రభాస్ కు సలార్ బిగ్గెస్ట్ హిట్ అందించింది. క్రిస్మస్ కానుకగా జనవరి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు థియేటర్స్ ఊగిపోయాయి. దాంతో రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ మూవీ. 

ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా సలార్ శౌర్యాంగపర్వం వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈఏడాది చివర్లో థియేటర్స్ లోకి రానుంది. ఇదిలా ఉంటే.. సలార్ సినిమాలో నారంగ్ పాత్రలో నటించిన నటుడు ఎమ్మెస్ చౌదరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి, ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ దేవా(ప్రభాస్) నారంగ్(ఎమ్మెస్ చౌదరి) కాళ్ళు పట్టుకునే సన్నివేశం గురించి వివరించారు. నిజాంనికి ఈ సన్నివేశాన్ని ప్రభాస్ డూప్ తో, అది కూడా మూడు యాంగిల్స్ లో షూట్ చేద్దామనుకున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే ప్రభాస్ మాత్రం డూప్ కాకుండా తానే చేయడానికి ముందుకు వచ్చాడట. అలా మూడుసార్లు దేవా,నారంగ్ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు ఎమ్మెస్ చౌదరి. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.