
‘బాహుబలి’ ప్రభాకర్ లీడ్ రోల్‌లో పాలిక్ దర్శకత్వంలో రావుల రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘రౌద్ర రూపాయ నమ:’ పాయల్ రాజ్‌పుత్ కీలక పాత్ర పోషిస్తోంది. రఘు, వెంకట్, మోహన సిద్దిఖి, తాగుబోతు రమేష్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక పాటను విడుదల చేయగా, గురువారం రెండో సాంగ్‌ను సాయి కుమార్ రిలీజ్ చేసి టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. జాన్ భూషణ్ కంపోజ్ చేసిన ఈ పాటకు ‘తళుకు తళుకుమను తారా.. కులుకులొలుకు సితారా’ అంటూ సురేష్ గంగుల లిరిక్స్ రాశారు. వినయ్, జయశ్రీ కలిసి పాడారు. ఈ మెలోడీ సాంగ్‌లో నటులు రఘు, మోహన సిద్ధి కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది.