దేవర షూటింగ్లో ప్రమాదం.. నటుడు సైఫ్ ఆలీ ఖాన్కు గాయాలు

దేవర షూటింగ్లో ప్రమాదం.. నటుడు సైఫ్ ఆలీ ఖాన్కు గాయాలు

దేవర(Devara) మూవీ షూటింగ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్(Saif ali khan) కు గాయాలయ్యాయని సమాచారం. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పండితున్నారని తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే. ఎన్టీఆర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇందులో భాగంగానే ఓ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్న వేళ.. ఈ సినిమాలో విలన్‌గా చేస్తున్న సైఫ్ ఆలీ ఖాన్ మోకాలి, భూజానికి గాయాలయ్యాయట.

పెద్ద ప్రమాదమేమీ కాకపోవడంతో ఆయన్ని ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రికి తెరలించారు. అయితే ఈ ప్రమాదంతో సైఫ్ ఆలీ ఖాన్ కు గతంలో తగిలిన గాయం తిరగబడిందట. అందుకే ఆయనకు ట్రైసప్(కండ) సర్జరీ చేయాలని సూచించారట వైద్యులు. దీంతో కొంతకాలం ఆయన సినిమా షూటింగ్ లకు దూరంగా ఉండనున్నారు. ఈ నేపధ్యంలో దేవర అనుకున్న డేట్ కు రిలీజ్ అవుతుందా? అనేది హాట్ టాపిక్ గా మారింది.