Kannappa: సెకండాఫ్లో రుద్ర ఎంట్రీ.. ప్రభాస్, విష్ణుల మధ్య డైలాగ్స్‌‌‌‌ అద్భుతం.: శివబాలాజీ

Kannappa: సెకండాఫ్లో రుద్ర ఎంట్రీ.. ప్రభాస్, విష్ణుల మధ్య డైలాగ్స్‌‌‌‌ అద్భుతం.: శివబాలాజీ

మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన చిత్రం ‘కన్నప్ప’. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా కీలకపాత్ర పోషించిన శివబాలాజీ మాట్లాడుతూ ‘ఇందులో మోహన్ బాబు గారు పోషిస్తున్న మహదేవశాస్త్రి పాత్రకు కొడుకుగా కనిపిస్తా.

సినిమా డిస్కషన్స్ టైమ్‌‌‌‌లో నాకు ఇవ్వదగ్గ పాత్ర ఇందులో లేదన్నారు విష్ణు. కానీ మోహన్ బాబు గారు కచ్చితంగా నేను ఈ ప్రాజెక్ట్‌‌‌‌లో ఉండాలని పట్టుపట్టారు. దీంతో కొన్ని రోజుల తర్వాత మహదేవశాస్త్రి కొడుకు పాత్రకు బాగుంటానని ఫైనల్ చేశారు.

పాత్ర నిడివి,  ప్రాముఖ్యత తక్కువ అయినప్పటికీ ఓ గొప్ప సినిమాలో భాగమవడం హ్యాపీ. న్యూజిలాండ్‌‌‌‌లో రెండు నెలల పాటు మోహన్ బాబు గారితో కలిసి షూటింగ్‌‌‌‌లో పాల్గొన్నాను. ఆయన ఆఫ్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌, ఆన్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌ వేరుగా ఉంటారు.

మూవీ ఆర్టిస్ట్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌కు పని చేస్తున్నప్పటి నుంచి నేను, విష్ణు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాం. కానీ మోహన్ బాబు గారికి దగ్గరవ్వడం కష్టం.. దగ్గరైతే ఇలా ప్రేమతో కట్టి పడేస్తారు. సినిమా అద్భుతంగా వచ్చింది.

సెకండాఫ్​లో ప్రభాస్‌‌‌‌ ఎంట్రీ తర్వాత సినిమా రేంజ్ పెరిగింది. ప్రభాస్, విష్ణు పాత్రల మధ్య డైలాగ్స్‌‌‌‌ ఇంప్రెస్ చేస్తాయి.  మోహన్ లాల్ ఎంట్రీ గూస్‌‌‌‌బంప్స్‌‌‌‌ తెప్పిస్తుంది. అక్షయ్ కుమార్ పాత్ర సర్​ప్రైజింగ్‌‌‌‌గా అనిపిస్తుంది.

ప్రస్తుతం మోహన్ బాబు గారి ప్రొడక్షన్‌‌‌‌లో హీరోగా ఓ సినిమా చేస్తున్నా. అలాగే ‘సింధూరం’ అనే మరో మూవీలో నటించా. ‘రెక్కీ 2’ కూడా త్వరలోనే రానుంది’ అని చెప్పాడు.