దుబాయ్‌ ఎయిర్ పోర్ట్ లో శివాజీకి చేదు అనుభవం

దుబాయ్‌ ఎయిర్ పోర్ట్ లో శివాజీకి చేదు అనుభవం

సినీ నటుడు శివాజీకి చేదు అనుభవం ఎదురైంది.  దుబాయ్‌ మీదగా అమెరికా వెళ్తున్న అతడిని ఈ నెల 26న దుబాయ్‌ ఎయిర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. శివాజీపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయంటూ తిరిగి అతడిని హైదరాబాద్‌ పంపించివేశారు. అయితే ఆ కేసుల విషయం తెలియాల్సి ఉండగా.. ఇప్పటికే టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ తో పాటు శివాజీపై హైదరాబాద్‌ పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

గతంలోనూ హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో శివాజీని అడ్డుకున్నారు. అయితే విదేశాలకు వెళ్లేందుకు శివాజీపై  ఎలాంటి ఆంక్షలు లేవని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. దుబాయ్‌ పోలీసులు ఎందుకు ఆపారో తెలియదన్నారు.