నాని 31 మూవీలో.. కీలక పాత్రలో తమిళ యాక్టర్

నాని 31 మూవీలో.. కీలక పాత్రలో తమిళ యాక్టర్

ఎప్పటికప్పుడు విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నాని(Nani). అందుకే ఆయన్ని ప్రేక్షకులు ప్రేమగా నేచురల్ స్టార్(Natural star) అని పిలుచుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆయన సినిమాల సెలక్షన్ కూడా అలాగే ఉంటుంది.

రీసెంట్ గా నాని దసరా పండుగ సందర్బంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ(Vivek athreya)తో నాని తన 31(Nani31)వ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌‌గా  ప్రియాంక అరుళ్ మోహన్‌‌ను ఫిక్స్ చేశారు. దీంతో ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో ఆకట్టుకున్న నాని, ప్రియాంక జోడీ మరోసారి రిపీట్ అవుతోంది. 

అలాగే నాని 31 మేకర్స్ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో తమిళ యాక్టర్, డైరెక్టర్ SJ సూర్య (SJ Suryah) కీ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలిపారు. దీంతో నాని మూవీకి అదనపు బలం తోడైందంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. SJ సూర్య హీరోగా, రైటర్ గా, విలన్ గా, డైరెక్టర్ గా తనదైన శైలిలో ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. మహేష్ బాబు స్పైడర్, మార్క్ ఆంటోనీ మూవీస్లో  నటించి సత్తా చాటారు. త్వరలో రామ్ చరణ్..శంకర్ కలయికలో రాబోతున్న గేమ్ ఛేంజర్ మూవీలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. 

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ DVV ఎంటర్టైన్మెంట్స్(DVV Entertainments) బ్యానర్ లో నాని 31మూవీ తెరకెక్కనుంది. ఈ సందర్బంగా ఒక వీడియోను కూడా షేర్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో.. ప్రాజెక్టు కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అక్టోబర్ 23న, పూజా కార్యక్రమం అక్టోబర్ 24న ఉండనుందని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ సినిమాకు సరిపోయిందా శనివారం అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది 

ఇటీవలే దసరా(Dasara) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని.. త్వరలో ఎమోషనల్ కంటెంట్తో తెరకెక్కిన హాయ్ నాన్న(Hi Nanna) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.