మంగళవారంతో మంచి పేరొచ్చింది : శ్రీతేజ్

మంగళవారంతో మంచి పేరొచ్చింది : శ్రీతేజ్

వంగవీటి,  కథానాయకుడు, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ధమాకా లాంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగా మంచి గుర్తింపును అందుకున్నాడు శ్రీతేజ్. ప్రస్తుతం ‘పుష్ప 2’తో సహా పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నాడు. 2023 సంవత్సరం మర్చిపోలేని జ్ఞాపకాలను అందించిందంటూ తన కెరీర్‌‌‌‌ గురించి మీడియాతో ముచ్చటించాడు శ్రీతేజ్. 

‘ఈ ఏడాది ‘మంగళవారం’ చిత్రంలోని గురజ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ పాత్ర గురించి వినగానే చాలా థ్రిల్‌‌ ఫీలయ్యాను. రిలీజ్ తర్వాత మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. అలాగే రవితేజ గారి ‘రావణాసుర’లో దేవరాజ్‌‌ రోల్‌‌ చేశాను. 

ఇదే ఏడాది నేను నటించిన ‘దళారి’ సినిమా కూడా రిలీజ్‌‌ అయ్యింది. అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన దర్శకనిర్మాతలు అందరికీ థాంక్స్. 2023 నాకు చాలా సంతోషాల్ని ఇచ్చింది. వచ్చే ఏడాది నేను హీరోగా నటిస్తున్న ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్‌‌ జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే ‘ర్యాంబో’ అనే మరో సినిమా వస్తోంది. నా రాబోయే చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నాడు.