ఆసక్తి పెంచుతున్న..గీతాంజలి మళ్లీ వచ్చింది అప్డేట్స్

ఆసక్తి పెంచుతున్న..గీతాంజలి మళ్లీ వచ్చింది అప్డేట్స్

సౌత్‌‌లో స్టార్ హీరోయిన్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న అంజలి ..పలు చిత్రాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తూ, ఫిమేల్ లీడ్‌‌గానూ ఇంప్రెస్ చేస్తోంది. తొమ్మిదేళ్ల క్రితం ‘గీతాంజలి’గా ఆకట్టుకున్న అంజలి..ఇప్పుడు దానికి గీతాంజలి మళ్లీ వచ్చింది సీక్వెల్‌‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

లేటెస్ట్గా ఈ మూవీ నుంచి విలన్ను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ హీరో క‌మ్ క‌మెడియ‌న్ సునీల్ కిల్ల‌ర్ నాని అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ పోస్ట‌ర్‌ లో సునీల్ ఒక హాంటెడ్ భ‌వ‌నం ముందు హాకీ స్టిక్‌తో నిల‌బ‌డి తీక్ష‌ణంగా చూస్తున్న‌ట్లు ఉంది. ఈ పోస్టర్లో సునీల్ హెయిర్ స్టైల్..లుక్స్ కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి.

రీసెంట్ గా అంజలి పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో క్లాసికల్ డ్యాన్సర్‌గా అంజలి కనిపిస్తుండగా..ఒక పాతబడిన బిల్డింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. అంజ‌లి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ హార్రర్ ఆడియన్స్ ను ఎంతగానో ఆక‌ట్టుకుంది.దీంతో సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి.

ఈ సినిమాకు కోన వెంకట్. కథ, స్క్రీన్ ఫ్లూ అందిస్తుండగా శివ తుర్లపాటి డైరెక్ట్ చేస్తున్నారు. అంజలి నటిస్తున్న 50వ సినిమా ఇది. శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు.